కొవాగ్జిన్‌.. ఇంకెంత కాలం? | Covaxin WHO Clearance More Delay Due to Technical Reasons | Sakshi
Sakshi News home page

Covaxin: చుక్కలు చూపిస్తున్న డబ్ల్యూహెచ్‌వో.. టెక్నికల్‌ వంకతో క్లియరెన్స్‌ ఆలస్యం

Published Tue, Sep 28 2021 7:39 AM | Last Updated on Tue, Sep 28 2021 7:51 AM

Covaxin WHO Clearance More Delay Due to Technical Reasons - Sakshi

కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తీసుకుని.. బయటి దేశాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్లకు ఇదొక చేదు వార్త.  కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అనుమతుల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుస్తోంది.  పూర్తి స్వదేశీ కొవిడ్-19 వ్యాక్సిన్‌ ‘కొవాగ్జిన్‌’.. డబ్ల్యూహెచ్‌వో ఈయూఏ లిస్ట్‌లో లేదు.  ఈ తరుణంలో  డబ్ల్యూహెచ్‌వో క్లియరెన్స్‌ తప్పనిసరిగా మారింది.  రేపో, ఎల్లుండో అనే అంచనాల నడుమ.. ఇప్పుడు ఆ క్లియరెన్స్‌ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. 

 

ఫేజ్‌ 3 ట్రయల్స్‌లో కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌  77.8 శాతం సమర్థవంతంగా ప్రభావం చూపెట్టిందని భారత్‌ బయోటెక్‌ ప్రకటించుకుంది. 

అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO).. మాత్రం కొవాగ్జిన్‌కు ఇంకా క్లియరెన్స్‌ ఇవ్వలేదు

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే క్లియరెన్స్‌ సంబంధిత దరఖాస్తు పత్రాలను డబ్ల్యూహెచ్‌వోకి సమర్పించింది

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌కు గ్లోబల్‌ బాడీ(డబ్ల్యూహెచ్‌వో) క్లియరెన్స్‌ దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వస్తోంది. 

అయితే నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ వీకే పాల్‌ మాత్రం ఈ నెలాఖరుకల్లా క్లియరెన్స్‌ వస్తుందని గతంలో ప్రకటించారు. 

కానీ, టెక్నికల్‌ సంబంధిత సమస్యలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. 

ఈ ఆలస్యం.. విదేశాలకు ప్రయాణించే భారతీయులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఇబ్బందికరంగా మారనుంది. 

WHO స్ట్రాటజిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (సేజ్‌) అక్టోబర్‌ 6న జరగబోయే భేటీలో కూడా కొవాగ్జిన్‌ క్లియరెన్స్‌పై స్పష్టత రాకపోవచ్చనే అంటున్నారు.  

భారత్‌లో కొవాగ్జిన్‌తో పాటు కొవిషీల్డ్‌ను ఈ ఏడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ద్వారా జనాభాకు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు, ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ సంయుక్తంగా భారత్‌కు చెందిన సీరమ్‌తో ఒప్పందం ద్వారా కొవిషీల్డ్‌ను తయారు చేసి అందిస్తున్నాయి. 

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అప్రూవల్‌(సర్టిఫికెట్‌ వెరిఫై ప్రక్రియ ద్వారా కొన్ని దేశాల్లోకి అనుమతిస్తున్నారు) ఉంది. 

అంతర్జాతీయ వైద్య విభాగంగా భావించే డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ యూజ్‌ ఆథరైజేషన్‌ లిస్ట్‌లో ఇప్పటిదాకా కేవలం.. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మోడెర్నా, సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌లకు మాత్రమే  చోటు దక్కింది.
 

చదవండి: ఒక అడుగు ముందుకు.. రెండు వెనక్కు!        

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement