ఇంగ్లాండ్: ఏదైనా పాముని మన నివాస స్థలాల తిరుగుతుంటే పాములు పట్టే నిపుణుడి సంప్రదించి తరలించే ఏర్పాట్లు చేస్తాం అవునా. కానీ కొన్ని అరుదైన అత్యంత విషపూరితమైన పాములను తరలించాలంటే వాటికి సంబంధించిన ప్రత్యేకమైన నిపుణలతోనే సాధ్యమవుతుంది. అచ్చం అలానే ఈ విషపూరిత పామును బ్రిటీష్ వైల్డ్‌లైఫ్ ఆసుపత్రి సిబ్బంది తరలించింది.
(చదవండి: కొత్త చట్టం.. ప్రపంచంలోనే తొలి దేశంగా న్యూజిలాండ్)
అసలు విషయంలోకి వెళ్లితే.....అత్యంత విషపూరితమైన పాము ఒకటి ఇటీవల భారతదేశం నుండి ఇంగ్లాండ్‌కు సుదీర్ఘ ప్రయాణం చేసింది. అయితే ఈ విషపూరితమైన సా-స్కేల్డ్ వైపర్ అనే పాము భారతదేశంలోని ఒక షిప్పింగ్ కంటైనర్‌లో ఉంది. పైగా ఈ పామును పట్టుకోవటం కోసం బ్రిటిష్ వైల్డ్‌లైఫ్ ఆసుపత్రి నుండి సిబ్బందిని రప్పించారు.
ఈ క్రమంలో ఇగ్లాండ్‌లోని సౌత్ బ్రిటీష్ వైల్డ్ లైఫ్ ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతు...." షిప్పింగ్ కంటైనర్‌లో దొరికిన పామును పట్టుకోవాలంటూ భారత్ నుంచి మాకు కాల్ వచ్చింది. అయితే ఈ పాము భారత్‌లోని ఒక రాళ్ల రవాణా చేసే కంటైనర్‌లో ఈ పాము ఉన్నట్లు అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి గుర్తించాడని చెప్పారు. అంతే కాదు ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము సా-స్కేల్డ్ వైపర్‌గా మేము గుర్తించాం. " అని వెల్లడించింది. ప్రస్తతం ఈ విషయం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవ్వుతోంది. దీంతో నెటిజన్లు ఆస్పత్రి సిబ్బంది ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ రకరకాలగా ట్వీట్ చేశారు.
(చదవండి: 900 ఏళ్ల నాటి పురాతన కత్తి)
Comments
Please login to add a commentAdd a comment