'నాకు బిల్‌గేట్స్‌తో ఎలాంటి ఎఫైర్ లేదు' | Elon Musk Tweet About Rumours Of Affair With Bill Gates | Sakshi
Sakshi News home page

'నాకు బిల్‌గేట్స్‌తో ఎలాంటి ఎఫైర్ లేదు'

Published Thu, Jul 30 2020 4:42 PM | Last Updated on Thu, Jul 30 2020 5:50 PM

Elon Musk Tweet About Rumours Of Affair With Bill Gates - Sakshi

న్యూయార్క్ : టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్  సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటార‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎప్పుడు ఏదో ఒక టెక్నాల‌జి గురించి ప్ర‌స్తావిస్తూ వార్త‌లో నిలిచే ఎల‌న్ ఈసారి మైక్రోసాప్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్‌పై ట్విట‌ర్ వేదిక‌గా త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. కొన్ని రోజుల క్రితం ఎల‌న్ మ‌స్క్ క‌రోనా వైర‌స్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనా గురించి ప్ర‌పంచ దేశాలు అన‌వ‌స‌రంగా భ‌య‌ప‌డుతున్నాయ‌ని, మ‌ర‌ణాల‌ను కూడా ఎక్కువ సంఖ్య‌లో లెక్కిస్తున్నార‌‌ని పేర్కొన్నారు. అంతేకాదు లాక్‌డౌన్‌ కూడా అంత అవ‌స‌రం లేదంటూ తెలిపారు. ఎల‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో పెద్ద దుమార‌మే రేపాయి.(సైకిల్ తొక్కి ఆశ్చర్యపరిచిన ప్రధాని బోరిస్‌‌)

తాజాగా మంగళ‌వారం బిల్‌గేట్స్ సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎల‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. 'ఎల‌న్ మ‌స్క్ క‌రోనా వైర‌స్‌పై త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదు. అత‌ను క‌రోనాకు వ్యాక్సిన్ క‌నిపెట్టే విష‌యంలో త‌ల‌దూర్చ‌లేదు. బ‌హుశా అత‌ను ఎల‌క్ట్రిక్ కార్ల‌ను బాగా త‌యారు చేయొచ్చు.. రాకెట్ల‌ను కూడా బాగా ప్ర‌యోగించ‌గ‌ల‌డు.. ఇలాంటి విష‌యాల్లో ఎల‌న్ ఆరితేరిన‌వాడ‌ని నేను ఒప్పుకుంటా. కానీ అత‌నికి తెలియ‌ని విష‌యాల్లో త‌ల‌దూర్చి అన‌వ‌స‌రంగా ఇబ్బందుల‌పాల‌వుతాడు. నాకు అది న‌చ్చ‌దు. అందుకే అత‌నికి తెలిసిన విష‌యాల‌కు ప‌రిమిత‌మైతేనే బాగుంటుంది' అంటూ బిల్‌గేట్స్ చుర‌క‌లంటించారు.

బిల్‌గేట్స్ వ్యాఖ్యల‌పై ఎల‌న్ మ‌స్క్ ట్విట‌ర్ వేదిక‌గా ట్రోల్ చేశాడు. 'బిల్‌గేట్స్ , నేను ప్రేమికులం అనే వార్త అవాస్త‌వం. నాకు బిల్‌గేట్స్‌తో ఎలాంటి ఎఫైర్ లేదు' అంటూ బ‌దులిచ్చాడు. అయితే ఎల‌న్ బిల్‌గేట్స్‌నుద్దేశించి ఈ ర‌క‌మైన ట్వీట్ ఎందుకు చేశాడ‌న్న‌ది నెటిజ‌న్ల‌కు అర్థంకాలేదు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎల‌న్ చేసిన ట్వీట్ దృష్టిలో ఉంచుకొని బిల్‌గేట్స్‌, అత‌ను క‌లిసి ఉన్న ఫోటోల‌ను షేర్ చేస్తూ .. ఎల‌న్ దీనికి కూడా వివ‌ర‌ణ ఇస్తే బాగుంటుంద‌ని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement