కెనడాలో మరోమారు హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఎడ్మంటన్‌లోని ఓ ఆలయంపై భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాశారు. బీఏపీఎస్ స్వామినారాయణ ఆలయంపై భారత వ్యతిరేక నినాదాలు రాశారని హిందూ అమెరికన్ ఫౌండేషన్ తెలియజేసింది.
ఈ ఘటనలో భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య బెదిరింపులకు గురయ్యారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో.. కెనడాలోని ఎడ్మంటన్‌లోగల బీఏపీఎస్ దేవాలయం వారి తాజా లక్ష్యం అని కెనడియన్ హిందూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లోని కొద్దిమంది హిందూ ఎంపీలలో ఒకరైన ఆర్య ఈ ఉదంతంలో బెదిరింపులకు గురయ్యారు. దీనిపై ఇక్కడి హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కెనడాలో హిందూ దేవాలయాలపై దాడుల ఘటనలు నానాటికీ పెరుగుతున్నాయని ఎంపీ చంద్ర ఆర్య పేర్కొన్నారు. తాజాగా ఎడ్మంటన్‌లోని బీఏపీఎస్ స్వామినారాయణ ఆలయం దాడుల బారిన పడిందన్నారు. గతంలో గ్రేటర్ టొరంటో ఏరియా, బ్రిటిష్ కొలంబియా, కెనడాలోని పలు ప్రదేశాలలో గల హిందూ దేవాలయాలపై భారతదేశ వ్యతిరేక నినాదాలు కనిపించాయని చంద్ర ఆర్య పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment