ఇరాన్‌లో హిజాబ్ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు, యువతులు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో హిజాబ్‌ను తొలగించారన్న కారణంగా ఇరాన్‌కు చెందిన ఇద్దరు హీరోయిన్లను అరెస్ట్ చేశారు. కాగా, వీరి అరెస్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.
వివరాల ప్రకారం.. ఇరాన్ హిజాబ్ వ్యతిరేక నిరసనకారులపై అణిచివేత కొనసాగుతున్నందున క్రమంలో ఆ దేశానికి చెందిన ప్రముఖ నటీముణులు హెంగమెహ్ ఘజియానీ, కటయోన్ రియాహిలను హిజాబ్ తీసి కనిపించడం కలకలం సృష్టించింది. పబ్లిక్‌గా వారు హిజాబ్‌ను తొలగించడంతో ఇరాన్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసింది. కాగా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీంతో, వారి అరెస్ట్ వివాదాస్పదంగా మారింది.
ఇక, అరెస్ట్ అనంతరం.. హెంగామెహ్ ఘజియాని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. బహుశా ఇది నా చివరి పోస్ట్ కావచ్చు. ఈ క్షణం నుండి నాకేం జరిగినా ఎప్పటిలాగే నా చివరి శ్వాస వరకు నేను ఇరాన్ ప్రజలతోనే ఉన్నానని తెలుసుకోండి అంటూ కామెంట్స్ చేశారు. కాగా, వీడియోలో నటి ఘజియానీ.. రద్దీగా ఉన్న ప్రాంతంలో హిజాబ్‌ను తొలగిస్తుంది. ఈ సందర్భంగా కెమెరాకు ఎదురుగా నిలబడి ఏమీ మాట్లాడకుండా తన జుట్టును ముడివేసుకుంటుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో కొన్ని క్షణాల్లోనే ఇరాన్‌లో వైరల్‌గా మారింది. దీంతో, ప్రభుత్వం ఆమెను వెంటనే అరెస్ట్ చేసింది. ఇదే కారణంతో కటయోన్ రియాహిలను కూడా ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment