అమెరికా, ఇజ్రాయెల్‌ వేడుకోవాల్సిందే: ఇరాన్‌ వార్నింగ్‌ | YS Jagan Birthday Wishes To Tamil Nadu CM MK Stalin, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

అమెరికా, ఇజ్రాయెల్‌ వేడుకోవాల్సిందే: ఇరాన్‌ వార్నింగ్‌

Mar 1 2026 12:29 PM | Updated on Mar 1 2026 3:18 PM

Iran Serious Warning To USA And Israel

టెహ్రాన్‌: అమెరికా, ఇరాన్‌ మధ్య దాడులు, మాటల యుద్ధం నడుస్తోంది. సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు పెంచింది. దీంతో, ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం, అమెరికాకు ఇరాన్‌ అదిరిపోయే కౌంటరిచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్‌ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ జారీ చేసింది. ఇక, ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌-4 పేరుతో ఇరాన్‌ దాడులు చేస్తోంది. 

అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలపై తాజాగా ఇరాన్‌ స్పీకర్‌, అధికారులు స్పందించారు. ఈ క్రమంలో ఇరాన్‌..‘సుప్రీం లీడర్‌ ఖమేనీ హత్య పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మా జవాబు చూసి శత్రువులు ఏడ్వాల్సిందే, వేడుకోవాల్సిందే. అమెరికా, ఇజ్రాయెల్‌ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మేము దాడులు చేస్తే శత్రువులు కూడా బెంబెలెత్తిపోవాల్సిందే. ఖమేనీ చూపిన బాటలోనే నడుస్తాం. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క’ అని డైరెక్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది.

ట్రంప్‌ హెచ్చరికలు.. 
అంతకుముందు ఇరాన్‌ను ట్రంప్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌తోపాటు మిడిల్‌ ఈస్ట్‌లోని అమెరికా స్థావరాలపై ఎడతెరిపి లేకుండా చేస్తున్న ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా హెచ్చరించారు. ఇంతకు ముందెన్నడూ చూడని బలంతో ప్రతిదాడులు చేస్తామని ట్రంప్‌ స్పష్టంచేశారు. చాలా తీవ్రంగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా దాడులు చేయనున్నట్లు ఇరాన్‌ ప్రకటించిందని ట్రంప్ గుర్తుచేశారు. వారు అలా చేయకపోవడమే మంచిదని, ఒక వేళ చేస్తే వారు కూడా ఇంతకు ముందు చూడని శక్తితో విరుచుకుపడతామని వార్నింగ్‌ ఇచ్చారు.

 

దుబాయ్‌ విలవిల.. 
మరోవైపు.. సుప్రీం లీడర్‌ ఖమేనీ హత్య తర్వాత పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఇరాన్‌ సైన్యం.. ఇజ్రాయెల్‌, అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్‌ క్షిపణుల రాకతో ఇజ్రాయెల్‌లో చాలా చోట్ల మోగిన సైరన్లు మోగాయి. ఇరాన్‌ డ్రోన్లు మరోసారి దుబాయ్‌ ఎయిర్‌పోర్టును మరోసారి తాకాయి. దీంతో, దుబాయ్‌ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతిన్నది. యూఏఈ, ఖతార్‌లలో అనేక చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. యూఏఈలోని అమెరికా స్థావరమైన జబేలీ అలీ పోర్టును ఇరాన్‌ క్షిపణి తాకింది. అబుదాబి విమానాశ్రయంపై కూడా ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. బుర్జ్‌ ఖలీఫా మీదుగా క్షిపణులు వెళ్తున్న దృష్యాలను ఇరాన్‌ మీడియా విడుదల చేసింది. పశ్చిమాసియాలోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్‌ సైన్యం తెలిపింది. ఇరాన్‌ దాడులతో బహ్రెయిన్‌, కువైట్‌లలో సైరన్ల మోత మోగిపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement