Man Wakes Up His girlfriend In The Most Unique Way | లవర్‌ను ఇలా కూడా నిద్రలేపుతారా? - Sakshi
Sakshi News home page

లవర్‌ను ఇలా కూడా నిద్రలేపుతారా?

Published Fri, Oct 23 2020 8:57 AM | Last Updated on Fri, Oct 23 2020 6:13 PM

Man Wakes Up Girlfriend From Sleep With Mic Set Song - Sakshi

వీడియో దృశ్యాలు

ఎవరినైనా నిద్రలేపాలంటే ఏం చేస్తాం?. చేతుల్లో తట్టి లేపుతాము.. లేయకపోతే మరి కొంచెం గట్టిగా.. అప్పటికీ లేయకపోతే ముఖంపై నీళ్లు చల్లుతాం. కానీ, ఓ వ్యక్తి తన ప్రియురాలిని నిద్ర లేపటానికి కొత్త పంథాను ఎంచుకున్నాడు. ఆమె ఆఫీసుకు వెళ్లటానికి లేట్‌ అవుతోందని పాట రూపంలో చెప్పాడు. అయితే ఆమె చెవి దగ్గరకు వెళ్లి మృదు మధుర స్వరంతో కాదు.. ముఖం దగ్గర మైక్‌ సెట్టు పెట్టి రూము దద్దరిల్లేలా. దీంతో ఆమె నిద్ర మేల్కొంది. అతడిపై కొద్దిగా సహనం వ్యక్తం చేస్తూ.. పక్కనే ఉన్న టేబుల్‌ గడియారంలో టైం చూసుకుని బెడ్‌ పైనుంచి కిందకు దిగింది. ( వర్షం లేదు..మరి వరద ఎలా వచ్చింది! )

అనంతరం అతడ్ని బెడ్‌మీదకు నెట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. గురువారం రెడ్డిట్‌లో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 55 సెకన్ల నిడివి కలిగిన వీడియో  66 వేల అప్‌ ఓట్లతో, 1500 కామెంట్లతో దూసుకుపోతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘అతడి స్వరం అద్భుతంగా ఉంది. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉన్న వ్యక్తి... ప్రియురాలని ఇలా కూడా నిద్ర లేపుతారా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ఒక్క పనితో రియల్‌ హీరో అనిపించుకున్నాడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement