![Viral Video Of Man Fails Terribly While Trying To Sing Manike Mage Hithe - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/6/manke.jpg.webp?itok=8tSzIncf)
శ్రీలంక సింగర్, రాపర్ యోహానీ పాడిన మనికే మాగే హితే పాట తెగ ఇండియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి వాయిస్‌కు ఇంటర్నెట్ ఫిదా అయిపొయింది. సంగీతానికి భాషతో పనిలేదని నిరూపించిన ఈ పాట భాష ఏదైనా.. భావం అర్థం కాకపోయినా ఫుల్ క్రేజ్ సంపాదించింది. రోజూ రకరకాల భాషల్లో.. వేర్వేరు ర్యాప్‌లతో ఈ సాంగ్ వెర్షన్లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ మెలోడియస్ ట్యూన్.. ఫ్యాన్స్‌తోపాటు, సెలబ్రిటీలను కూడా కట్టిపడేస్తోంది.
చదవండి: వామ్మో! అంత ఎత్తులోంచి ఒకేసారి దూకేసారు... చివరికి
ఈ పాటకు ఎంతో మంది రీల్స్, టిక్‌టాక్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా ఈ పాట మరోసారి వైరల్‌గా మారింది. అయితే ఈ సారి ఓ వ్యక్తి మనికే మాగే హితే పాటను పాడేందుకు ప్రయత్నించాడు. కానీ పూర్తిగా ఫెయిలయ్యాడు. పాట ప్రారంభమమైన్పుడు లిప్ మూమెంట్ ఇస్తూ చివరకు పదాలు అర్థం కాక పిచ్చిపిచ్చిగా పాడేసాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీ గిద్దా పోస్టు చేసింది. దీనిని చూసిన నెటిజన్లు తమ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. కొంతమంది అతన్ని సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది ‘ఆరే ఎంట్రా ఇది. నువ్వు ఎంచుకున్న తాళం ఏంటి పాడుతున్న పాటేంటి... ఈ పాట వింటుంటే కళ్లు తిరుగుతున్నాయి’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
చదవండి: అరుదైన వింత సంఘటన... తోకతో పుట్టిన బాలుడు
Comments
Please login to add a commentAdd a comment