రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం | 2023 Nobel Prize In Chemistry Declared To Three Scientists For the Discovery And Synthesis Of Quantum Dots - Sakshi
Sakshi News home page

Nobel Prize 2023 In Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

Published Wed, Oct 4 2023 4:19 PM | Last Updated on Wed, Oct 4 2023 4:49 PM

Nobel Chemistry Moungi Bawendi Louis Brus Alexei Ekimov Quantum Dots - Sakshi

ఆయా రంగాల్లోని ప్రజ్ఞావంతులకు నోబెల్ పురస్కారాలను అందించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే క్రమంలో 2023 సంవత్సరానికిగాను రసాయన శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ నోబెల్ బహుమతి వరించింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటించింది. క్వాంటం చుక్కల ఆవిష్కరణ, సంశ్లేషణకు గాను మౌంగి జి. బావెండి, లూయిస్ ఇ. బ్రస్, అలెక్సీ ఐ. ఎకిమోవ్‌లకు నోబెల్ ప్రైజ్ బహుకరించింది.  

క్వాంటమ్ డాట్స్ అనేవి చాలా సూక్ష‍్మమైన నానోపార్టికల్స్. నానోటెక్నాలజీలో ఈ క్వాంటమ్ డాట్స్‌ను ప్రస్తుతం టెలివిజన్‌లు, ఎల్‌ఈడీ దీపాలతో పాటు అనేక పరికరాల్లో ఉపయోగిస్తున్నాము. అంతేకాకుండా ఇవి కణితి కణజాలాన్ని తొలగించినప్పుడు సర్జన్‌లకు కూడా ఇవి మార్గనిర్దేశం చేయగలవు.

విభిన్న రంగాల్లోని ప్రతిభావంతులకు నోబెల్ అవార్డులను ప్రకటించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా మొదట వైద్య రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించింది కమిటీ. నిన్న భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తలు పేర్లను ప్రకటించారు. కాగా నేడు రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించడం విశేషం.

నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించే క్రమంలో ఇప్పటికే వైద్య, భౌతిక రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించిన కమిటీ  బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్‌ శాంతి రంగాల్లో బహుమతుల విజేతలను ప్రకటించనుంది. చివరిగా ఈ నెల 9న అర్థశాస్త్రంలో విజేతను ప్రకటించనుంది జ్యురీ. నోబెల్ విజేతలకు డిసెంబర్‌ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్‌ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్లు అందజేశారు. ఈసారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి: 2023 Nobel Prize: కోవిడ్‌–19 టీకా పరిశోధనలకు నోబెల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement