Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా పుతిన్‌ను అంతర్జాతీయ సమాజం ఎంతగా తిట్టిపోస్తుందో.. హీరోయిజం చేష్టలతో రష్యాను రెచ్చగొడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీను సైతం అదే స్థాయిలో విమర్శిస్తోంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆదివారం ఆయన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పుతిన్‌తో చర్చలకు తాను సిద్ధమని, ఒకవేళ అవి గనుక విఫలం అయితే తదనంతర పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. ‘‘ఆయనతో(పుతిన్‌ను ఉద్దేశించి) చర్చలకు నేను సిద్ధం. ఇప్పుడు కాదు.. గత రెండేళ్లుగా సిద్ధంగానే ఉన్నా. సంధి కాకుండా మరో మార్గంలో ఈ యుద్ధం ముగుస్తుందని నేను అనుకోవడం లేదు’’ అని సీఎన్‌ఎన్ ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ పేర్కొన్నాడు. చర్చలు ఏ దోవలో జరిగినా పర్వాలేదు. కానీ, పుతిన్‌తో మాట్లాడడం కచ్చితంగా జరగాలనే కోరుకుంటున్నా. చర్చా ప్రయత్నాలు గనుక విఫలం అయితే మాత్రం దానర్థం మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్లే అని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డాడు. అయితే ఆ యుద్ధం తీరు తెన్నులపై స్పందించేందుకు మాత్రం జెలెన్‌స్కీ విముఖ త్యవక్తం చేశాడు.
ఇది ఉక్రెయిన్‌కు మాత్రమే కాదు.. ప్రపంచానికి కూడా విపత్కర పరిస్థితి. ప్రతీ ఒక్కరూ నా మాట వినాలని కోరుకుంటున్నాను.. ముఖ్యంగా మాస్కోలో ఉన్నవాళ్లు. ఇది కలిసి మాట్లాడాల్సిన సమయం.. యుద్దం వద్దని తేల్చుకోవాల్సిన సమయం. ఉక్రెయిన్‌కు ప్రాదేశిక సమగ్రతను న్యాయాన్ని పునరుద్ధరించడానికి ఇంతకుమించి మంచి సమయం దొరకదు అంటూ జెలెన్‌స్కీ భావోద్వేగంగా మాట్లాడాడు. ఇక చర్చలలో తన ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయని Zelensky గతంలోనూ చెప్పాడు. ‘‘యుద్ధం ముగింపు, భద్రతా హామీలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడం, ఉక్రెయిన్ దేశానికి నిజమైన హామీలని.. అవే దేశానికి నిజమైన రక్షణ’’ అంటూ పిలుపు సైతం ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment