హూస్టన్: శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలు, కణజాలాల జోలికి పోకుండా కేన్సర్ కణుతులను మాత్రమే చంపేసే కొత్త విధానాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. నేచురల్ కిల్లర్ (ఎన్‌కే) కణాల వంటి రోగ నిరోధక కణాలతో తయారైన యాంటీట్యూమర్ రోగ నిరోధక ప్రతిస్పందనను ఈ చికిత్స ద్వారా క్రియాశీలకంగా మార్చవచ్చు.
అంకోలైటిక్ వైరోథెరపీ (ఓవీ) అనే ఈ విధానం ఇటీవల వచ్చిన కేన్సర్ చికిత్సల్లో అత్యంత నమ్మకమైనదిగా భావిస్తున్నారు. హూస్టన్‌లోని సెంటర్ ఫర్ న్యూక్లియర్ రిసెప్టార్స్ అండ్ సెల్ సిగ్నలింగ్ డైరెక్టర్ షౌన్ ఝాంగ్ దీన్ని అభివృద్ధి చేశారు. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం ఆయనకు భారీ గ్రాంటు మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment