న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6వ తేదీన భారత్‌కు రానున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. అదే రోజు ఆయన ప్రధాని మోదీతో భేటీ అవుతారని తెలిపింది. ఇద్దరు నేతలు ఏడాదికోసారి సమావేశమై రెండు దేశాల నడుమ కొనసాగుతున్న అన్ని రకాల సంబంధాలపై సమీక్ష జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో రష్యా అధ్యక్షుడు, భారత ప్రధాని మధ్య 21వ వార్షిక శిఖరాగ్ర భేటీ జరగనుంది. ]
ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉమ్మడి ప్రయోజనకరమైన వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం వెల్లడించారు. దీంతోపాటు, అదే రోజు రెండు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మంత్రుల మధ్య 2+2 చర్చలు కూడా జరుగుతాయని వివరించారు.
చదవండి: తైవాన్‌కు మద్దతు తెలిపిన అమెరికా ప్రజాప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment