
నార్వే: నార్వేలోని ఓస్లోలో గే బార్ నైట్ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దుర మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. ఐతే కాల్పులు జరిగిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే అనుమానితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసుల ప్రతినిధి టోర్ బార్‌స్టాడ్ చెప్పారు. గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఓస్లోలోని లండన్ పబ్‌లో కాల్పుల సృష్టించిన వ్యక్తిని చూసినట్లు ఒక పబ్లిక్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ చెప్పాడన్నారు.
ఈ మేరకు జర్నలిస్ట్ ఒలావ్ రోన్నెబర్గ్ మాట్లాడుతూ...తాను ఒక వ్యక్తి బ్యాగ్‌తో గే బార్ నైట్ క్లబ్‌లోకి ప్రవేశించడం చూశానన్నారు. ఆ తర్వాత అతను తుపాకీ తీసుకుని కాల్చడం ప్రారంబించాడని చెప్పారు. ఐతే ఈ దాడికి గల కారణాలేమిటో ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల నేపథ్యంలో నార్వేలో రెడ్ అలర్ట్ ప్రకటించామని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment