South Africa Doctors Reveals About Covid Omicron Variant Symptoms - Sakshi
Sakshi News home page

Covid Omicron Variant: మహమ్మారి అంతానికే వేగం పెంచిందేమో... 

Published Wed, Dec 1 2021 4:05 AM | Last Updated on Fri, Dec 3 2021 4:41 PM

South African Doctors Comments Over Omicron Variant - Sakshi

ఒమిక్రాన్‌... ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ భయపెడుతున్న మాట. విస్తరిస్తున్న తీరు, అందులో ఉన్న మ్యుటేషన్స్‌ ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే.. ఈ వేరియెంట్‌ను సౌతాఫ్రికాలోని బోట్స్‌వానాలో గుర్తించి వారం దాటింది. ఇప్పటివరకు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరడం, మరణం నమోదు కాలేదని ఆఫ్రికా డాక్టర్లు చెబుతున్నారు.

ఒమిక్రాన్‌ బారిన పడినవాళ్లలో యువత ఎక్కువగా ఉన్నారనీ, వారిలోనూ అలసట, తలనొప్పి, కండరాల నొప్పుల వంటి తేలికపాటి లక్షణాలున్నాయని, వీటివల్ల రోగి రెండు మూడు రోజుల్లోనే రికవరీ అవుతున్నారని ఈ వేరియెంట్‌ని మొట్టమొదట గుర్తించిన సౌతాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ ఛైర్‌ పర్సన్‌ డాక్టర్‌ ఏంజిలిక్‌ కోట్జీ తెలిపారు. ఇప్పుడున్నస్థాయిలో అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె చెబుతున్నారు.  

ప్రాణాంతకం కాకపోవచ్చు!? 
అదే నిజమైతే... ప్రపంచానికిదో ఎర్లీ క్రిస్మస్‌ గిఫ్ట్‌ అని జర్మన్‌ వైద్య నిపుణులు ప్రొఫెసర్‌ కాల్‌ లాత్‌బాక్‌ అంటున్నారు. ఒమిక్రాన్‌ మ్యుటేషన్స్‌ డెల్టా వేరియెంట్‌ కంటే రెండు రెట్లు అధికం. శ్వాసకోస వ్యాధులు కలిగించే ఇతర వైరస్‌లూ ఇలాగే పరిణామం చెందుతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్‌ వేగం పెరిగినా... ప్రాణాంతకం కాకపోవచ్చని అభిప్రాయ పడుతున్నారు.

ఇది నిజమే కావచ్చంటున్నారు తూర్పు ఆంగ్లియా విశ్వవిద్యాలయ అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్‌ పాల్‌ హంటర్‌. ఇన్ఫెక్షన్‌కు గురై.. ఆరోగ్యంగా బయటపడ్డవారిని, వ్యాక్సినేషన్‌ వేసుకున్నవాళ్లను ఇది అంతగా ప్రభావితం చేయకపోవచ్చని చెబుతున్నారు.  
చదవండి: Cryptocurrency: ఒమిక్రాన్‌ పేరులోనే మ్యాజిక్‌ ఉంది

కొద్దిరోజులే కదా.. కొట్టిపారేయలేం: డబ్ల్యూహెచ్‌ఓ
ఒమిక్రాన్‌ ఎలా వ్యాప్తి చెందుతుంది? దీని నుంచి వ్యాక్సిన్లు మనల్ని రక్షిస్తాయా? ఒమిక్రాన్‌ వల్ల ఆస్పత్రి పాలవ్వడం, మరణాలు పెరుగుతాయా? పాతవాటికంటే ఇది తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుందా వంటి ప్రశ్నలన్నింటికి సమాధానం వచ్చేదాకా ఏం చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇది బయటపడి కొద్ది రోజులే అవుతున్నందున తేలికపాటి లక్షణాలేనని కొట్టిపారేయలేమని రీడింగ్‌ యూనివర్సిటీ మైక్రోబయాలజిస్ట్‌ డాక్టర్‌ సైమన్‌క్లార్క్‌ హెచ్చరిస్తున్నారు.

తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం కావొచ్చని ఆయన అంటున్నారు. డెల్టా వేరియెంట్‌కంటే తక్కువనుకుంటే... వూహాన్‌ ఒరిజినల్‌కంటే అధ్వాన పరిస్థితులకు దారితీయొచ్చని చెబుతున్నారు. ఒమిక్రాన్‌ బారిన పడిన ఎవరో ఒకరు తీవ్ర అనారోగ్యం పాలైతే తప్ప దీని ప్రభావాన్ని నిర్ధారించలేమంటున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోనివారు తీసుకోవాలని, రెండు డోసులు తీసుకున్నవారు... బూస్టర్‌ డోస్‌ తప్పనిసరిగా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాక్సిన్లు ఈ వేరియెంట్‌ మీద చూపించే ప్రభావం అంతంతేనని ప్రపంచవ్యాప్త డేటా చెబుతోంది. ఇప్పడే నిర్ధారణకు రావడం తొందరపాటు అవుతుంది... రెండు వారాలు వేచి చూడాల్సిందేనని యూఎస్‌ వైద్య సలహాదారు డాక్టర్‌ ఆంతోనీ అంటున్నారు.   

ఆందోళన కలిగించే అంశాలు.. 
ఈ బోట్స్‌వానా వేరియెంట్‌లో ఆందోళన కలిగించే అంశాలు.. 50 మ్యుటేషన్స్‌. అందులో 30శాతం స్పైక్‌ ప్రోటీన్‌ మీదవే. ఈ మ్యుటేషన్స్‌ వల్ల వైరస్‌ రూపమే మారిపోతుంది. రూపం మారిన వైరస్‌ను వ్యాధినిరోధక శక్తి గుర్తించడం, దానిమీద పోరాడటం కష్టమవుతుంది. ఇందులో మూడు మ్యుటేషన్స్‌  ఏ665 ,  N679 ఓ,  ్క681 ఏ శరీర కణాల్లోకి  సుల భంగా ప్రవేశిస్తాయి. గత మ్యుటేషన్స్‌ తరహాలో ఇందులో మెంబ్రేన్‌ ప్రొటీన్‌  N్క6 లేకపోవడం వ్యాధి తీవ్రతను పెంచొచ్చు.

గతంలో తీవ్ర ఇన్ఫెక్షన్‌కి కారణమైన  ఖ203 ఓ,  ఎ204 ఖరెండు మ్యుటేషన్స్‌ కూడా ఈ వేరియెంట్‌లో ఉన్నాయి. ఇందులోని  ఓ417 N,  ఉ484 అ మ్యుటేషన్స్‌ గతంలో బేటా వేరియెంట్‌లోనూ ఉన్నాయి. ఇవి వ్యాక్సిన్స్‌ను తట్టుకునే రకం. యాంటీబాడీల నుంచి తప్పించుకోగలిగే... N440 ఓ,   477N మ్యుటేషన్స్‌ ఇందులో ఉన్నాయి. ఇవి గతేడాది మార్చిలో కేసుల పెరుగుదలకు కారణమయ్యాయి.  ఎ446  ,  ఖీ478 ఓ,  ఖ493 ఓ,  ఎ496  ,  ఖ498 ఖ,  ్గ505 ఏ మ్యుటేషన్స్‌ పట్ల ఇంకా స్పష్టత రాలేదు.  
– సాక్షి, సెంట్రల్‌డెస్క్‌

యువత ఓకే.. వృద్ధులు, పిల్లల సంగతేంటి? 
ప్రస్తుతం ఆఫ్రికాలో రోజుకు సగటున 6,000 మంది వైరస్‌ బారిన పడుతున్నారు. ఈ వేరియంట్‌కు ముందు ఉన్న కేసుల సంఖ్యతో పోల్చుకుంటే ఇది 20 రెట్లు అధికం. శాస్త్రీయంగా  ఆ.1.1.529గా పిలిచే ఒమిక్రాన్‌.. యువతలో తక్కువ లక్షణాలు చూపించడం వ్యాప్తికి కారణమవుతోంది.

అయితే పెద్దవయసు వారిలో ఈ లక్షణాలు, తీవ్రతలో తేడా ఉండొచ్చని నిపుణుల అంచనా. దక్షిణాఫ్రికా మొత్తం జనాభాలో 65 ఏళ్లు దాటినవారు ఆరుశాతం మాత్రమే... కాబట్టి ఆందోళన అవసరం లేదు. కానీ వృద్ధులు ఎక్కువగా ఉన్న దేశాల పరిస్థితి ఏమిటి, వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement