ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. తాలిబన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఒక్క పాకిస్థాన్ మాత్రం సంబరపడుతోంది. తాలిబన్ల చర్యపై హర్షం వ్యక్తం చేస్తూ పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ‘బానిస సంకెళ్లను తెంచారు’ అని అభివర్ణించారు. విద్యా విధానంలో ఆంగ్ల మాధ్యమంపై నిర్వహించిన ఓ సమావేశంలో ఇమ్రాన్‌ఖాన్ అఫ్గన్ పరిణామాలపై స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
ఇతరుల సంస్కృతికిని అలవాటు చేసుకుని దానికి పూర్తిగా విధేయులుగా మారుతున్నారు. అదే జరిగితే అది బానిసత్వం కన్నా కూడా దారుణం. సంస్కృతికి బానిసత్వాన్ని వదులుకోవడం అంత సులువు కాదు. అఫ్గనిస్తాన్‌లో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటీ? వాళ్లు (తాలిబన్లు) బానిస సంకెళ్లను తెంచారు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తాలిబన్లకు పాకిస్థాన్ పరోక్షంగా సహకరిస్తోందని వస్తున్న ఆరోపణలు వాస్తవమేనని ఇమ్రాన్ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. తమ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న అఫ్గన్‌లో అలజడులకు పాక్ మద్దతు ఉందని తేటతెల్లమవుతోంది. ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment