Top Trending News: Today 4th June 2022 Morning Highlight News - Sakshi
Sakshi News home page

Telugu Trending News Today: అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!

Published Sat, Jun 4 2022 10:00 AM | Last Updated on Sat, Jun 4 2022 10:43 AM

Telugu Top News Today 4th June 2022 Morning Highlight News - Sakshi

1.జనసేనలో లుకలుకలు.. నేతల మధ్య మాటామాటా పెరిగి కొట్టుకున్నారా?

జనసేన పార్టీలో నేతల మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన సమావేశం సందర్భంగా పార్టీ నేతల మధ్య విభేదాలు పొడచూపినట్టు సమాచారం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2.ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం


ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరింది. ఇచ్చిన హామీ మేరకు సంస్థను ప్రభుత్వంలో విలీనంచేసిన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ప్రభుత్వోద్యోగులతో సమానంగా పీఆర్సీ కూడా అమలుచేయనుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3.జూలై 4న ప్రధాని మోదీ భీమవరం రాక


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్న నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4.ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. ‘కూతుళ్లూ అర్హులే’


మేజర్లుగా ఉన్న కుమారులకు పునరావాసం, పునఃనిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీ ఇచ్చి మేజర్లైన కుమార్తెలకు ఇవ్వకపోవడం వివక్ష అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5.మెట్రో స్టేషన్‌లో యువతిపై లైంగిక వేధింపులు.. మరీ ఇంత దారుణమా..?


బాధిత యువతి ఢిల్లీలోని జోర్‌బాగ్‌ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కింది. అనంతరం రైలులో ఉన్న ​ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఓ అడ్రస్‌ గురించి అడిగాడు. ఈ క్రమంలో ఆమె అతడికి అడ్రస్‌ చెప్పింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6.ఎలన్‌ మస్క్‌ కామెంట్లు.. మీడియా సాక్షిగా బైడెన్‌ చురకలు


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎలన్‌ మస్క్‌కు చురకలు అంటించారు. తాను ఎప్పటికీ బైడెన్‌ అభిమానిని కాదంటూ ప్రకటించుకున్న ఎలన్‌ మస్క్‌.. తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు రాయిటర్స్‌లో పబ్లిష్‌ అయ్యాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7.మంకీపాక్స్‌ టెర్రర్‌.. ఒక్కరోజే 51 కేసులు.. ఈ వయస్సు వారే బాధితులు


కరోనా వేరియంట్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మంకీపాక్స్‌ రూపంలో మరో ఉపద్రవం తోడైంది. ఈ కొత్త వైరస్‌ మంకీపాక్స్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8.శ్రీలంక బౌలింగ్‌ కోచ్‌గా మలింగ 


సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఈ నెల 7న మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక జట్టుకు బౌలింగ్‌ వ్యూహాత్మక కోచ్‌గా ఆ దేశ దిగ్గజ పేస్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ వ్యవహరిస్తాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9.ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ సినిమా టైటిల్‌ ఇదేనా ?


వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ సినిమా సెట్స్‌కి వెళుతుందని టాక్‌. ఈ చిత్రానికి ‘అసుర’ లేదా ‘అసురుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్‌.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.ఒక్క ఏడాదిలోనే ఎంత అభివృద్ధి! రూ. 9 లక్షల బహుమతిని గ్రామం!


సర్పంచ్‌గా ఏడాదిపాటు ఉండి పర్యావరణాన్ని ఎంతబాగా కాపాడుకోవచ్చో చేతల్లో చేసి చూపించి ఎంతోమందికి ఉదాహరణగా నిలుస్తోంది ప్రియాంక. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement