చిన్న పాము కనిపిస్తేనే భయంతో వణికిపోతాం. అమాంతం అక్కడి నుంచి పారిపోతాం. మళ్లీ కొద్ది రోజుల వరకు ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసించం. అలాంటి రెండు పెద్ద పెద్ద కొండ చిలువలు ఇంట్లోకి వస్తే.. సీలింగ్‌కు వేలాడి కొట్లాడుతూ కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా..? పై ప్రాణాలు పైకే పోతాయి. ఇలాంటి సంఘటనే ఓ ఆస్ట్రేలియన్‌కు ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ కి చెందిన డేవిడ్ టైట్ అనే వ్యక్తి పనిమీద బయటకు వెళ్లాడు.
తిరిగి ఇంటికి వచ్చేసరికి తన కిచెన్‌లో రెండు పెద్ద పెద్ద కొండ చిలువలు సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాయి. బాగా లావుగా కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి 9 అడుగుల పొడవుతో దాదాపు 45 కిలోల బరువును కలిగి ఉన్నాయి. వాటిని చూసిన డేవిడ్ భయంతో బయటకు పరుగులు తీశాడు. వెంటనే పాములు పట్టుకునే వారికి సమాచారం అందించారు. దీంతో స్నేక్ క్యాచర్ వచ్చి రెండు పాములను పట్టుకున్నాడు. ఆరెండు పాములు మగవి అని, ఆడపాము కోసం అవి కొట్టుకున్నాయని పాములు పట్టే వ్యక్తి తెలిపారు. అయితే ఆడ పాము మాత్రం ఇంకా కనిపించలేదని తెలిపారు. కానీ కచ్చితంగా అది చుట్టుపక్కలో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment