లాక్‌డౌన్ కాలంలో అందరూ ఉంట్లో ఉంటూ బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఏం చేయాలో తోచక సోషల్ మీడియాలో విచ్చలవిడిగా సమయం గడుపుతున్నారు. ఏదైనా కొత్తగా, వింతగా కనిపిస్తే తెగ వెతికేస్తున్నారు. దీంతో మెదడుకు మేత పెట్టే అనేక విషయాలు పుట్టుకొస్తున్నాయి. అయితే అలాంటి వారి కోసమే తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన పాములను రక్షించే ‘స్నేక్ క్యాచర్స్ నార్తర్న్ రివర్స్ 24/7’ అనే సంస్థ తమ ఫేస్‌బుక్‌లో అలాంటి ఓ పజిల్‌నే పోస్ట్ చేశాడు. అడవిలో కొన్ని చెట్లు ఉన్న ఫోటోను పోస్ట్ చేసి జాగ్రత్తగా పరిశీలించి.. ఇందులో పాము ఎక్కడుందో కనుక్కోవాలని సూచించాడు. (విద్యార్థులూ.. ‘లాక్‌డౌన్’లో ఇలా ప్రిపేర్ అవ్వండి! )
"స్పాట్ ది స్నేక్!" ఈ ఫోటోలో ఉన్న పాములును మీరు గుర్తు పట్టగలరా .. పామును గుర్తించిన వారికి అధిక పాయింట్లు ఇస్తాం’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చిత్రంలో నిజంగా పాము ఎక్కడుందో కనుక్కుందామని అందరూ ఆసక్తిగా వెతుకుతున్నారు. అయితే కొంతమంది ఇది చాలా కష్టంగా ఉందని..ఎంత వెతికిన తమకు కనిపించడం లేదని చెబుతున్నారు. కొందరు వెతుకుతున్నామని.. మరి కొందరు తమకు పాము కనిపించిందని కూడా కామెంట్ చేస్తున్నారు. కాగా కొన్ని పాములు తమకు అనువైన ప్రదేశాల్లో నక్కి దాక్కుంటాయి. అలా దాక్కున్న వాటిని కనిపెట్టడం చాలా కష్టం. అయితే మీకేమైనా ఆ పాము కనిపిస్తోందో చూడండి మరి. (ఈ ఫొటోలో ఎన్ని పులులు దాగున్నాయో చెప్పగలరా?)
అయితే చివరకి స్నేక్ క్యాచర్స్ నార్తర్న్ రివర్స్ సంస్థనే ఫోటోలో పాము ఉన్న ప్రదేశాన్ని జూమ్ చేసి చూపించింది. అది తీరప్రాంతల్లో నివసించే కొండచిలువగా పేర్కొంది
Comments
Please login to add a commentAdd a comment