
భారత్ ప్రయోజానాల దృష్ట్యా యుద్ధం ఆపమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కి చెప్పండి అని ఉక్రెయిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించింది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని రష్యాను కోరండి అని ప్రధాని మోదీకి పిలుపునిచ్చారు. ఇది అన్ని దేశాల ఉత్తమ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు.
యుద్ధం ముగిస్తే గనుక అన్ని దేశాలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఉక్రెనియన్ వ్యవసాయ ఉత్పత్తుల అతిపెద్ద వినయోగదారులలో భారత్ ఒకటి అన్నారు. ఈ యుద్ధం కొనసాగితే కొత్త పంటలకు విత్తనాలు వేయడం మాకు కష్టమవుతుంది కాబట్టి భారత ఆహార భద్రత పరంగా కూడా ఈ యుద్ధాన్ని ఆపాడం ఉత్తమం అని చెప్పారు. ఈ యుద్ధం అందరి ప్రయోజనాలకు విరుద్ధం" అని వ్లాదిమిర్ పుతిన్‌కు విజ్ఞప్తి చేయాలని రష్యాతో ప్రత్యేక సంబంధాలను నెరుపుతున్న భారత్‌తో సహా అన్ని దేశాలను డిమిట్రో కులేబా కోరారు.
పైగా రష్యా పై మరిన్ని ఆంక్షలను విధించాలని డిమాండ్ కూడా చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. విదేశీ పౌరులను తరలించే వరకు కాల్పలు నిలిపివేయాలని కోరారు. విదేశీయుల తరలింపు కోసం ఉక్రెయిన్ రైళ్లను ఏర్పాటు చేయడమే కాక రాయబార కార్యాలయంతో పనిచేస్తోందని కూడా చెప్పారు. పైగా ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా తనవంతుగా కృషి చేస్తుందని అన్నారు.
(చదవండి: పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్.. బైడెన్‌కు జెలెన్ స్కీ ఫోన్)
Comments
Please login to add a commentAdd a comment