మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్ల‌ని జేడీ వాన్స్‌! | Vance Has Not Yet Left For Iran talks in Pakistan Source says | Sakshi
Sakshi News home page

మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్ల‌ని జేడీ వాన్స్‌!

Apr 20 2026 11:01 PM | Updated on Apr 21 2026 12:56 AM

Vance Has Not Yet Left For Iran talks in Pakistan Source says

ప‌శ్చిమాసియా సంక్షోభం మరింత ముదురుతోంది. రెండో విడ‌త చ‌ర్చ‌ల కోసం పాక్‌కు వ‌చ్చేది లేద‌ని ఇరాన్ మొండికేసి కూర్చుంది. మ‌రోవైపు అమెరికా ప్ర‌తినిధులు మాత్రం ఇరాన్‌తో రెండో విడ‌త చ‌ర్చ‌ల కోసం పాక్ రాజ‌ధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన వేళ ఒక కీల‌క అప్‌డేట్ వెలుగులోకి వ‌చ్చింది. 

ఇరాన్‌తో చ‌ర్చ‌ల నిమిత్తం అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్‌కు వెళ్ల‌లేద‌నే రాయిట‌ర్స్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్‌కు చెందిన కాన్వాయ్ వైట్‌హౌస్‌కు చేరుకోవ‌డం ఈ విషయానికి మ‌రింత బ‌లం చేకూర్చిన‌ట్ల‌యింది. బుధ‌వారంతో ఇరాన్‌, అమెరికా మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం ముగియ‌నుంది. 

ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గాల్సి ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు జేడీ వాన్స్ అస‌లు పాక్‌కు వెళ్ల‌లేద‌ని వ‌స్తున్న వార్త‌ల‌తో మ‌లి విడ‌త చ‌ర్చ‌లు జ‌ర‌గడం అనుమానమే. తొలి విడ‌త చ‌ర్చ‌ల‌కు అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్‌, వైట్‌హౌస్ ప్ర‌తినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంంప్ అల్లుడు జారెడ్ కుష్న‌ర్‌లు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. 

కానీ ఆ చ‌ర్చ‌లు ఎటూ తేల‌కుండానే ముగిశాయి. మ‌రోవైపు శాంతి చ‌ర్చ‌ల‌కు హాజ‌ర‌య్యే విష‌యాన్ని తాము ఇంకా ప‌రిశీలిస్తూనే ఉన్నామ‌ని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఇరాన్ అధికారి ఒక‌రు రాయిట‌ర్స్‌కు పేర్కొన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement