
Willing To Meet Vladimir Putin: దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ...ఈ యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాతో చర్చలు జరపడం చాల కష్టతరంగా మారింది. ఉక్రెయిన్ సైనిక సామార్ధ్యాన్ని దిగజార్చేలా పౌరులనే లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు నిర్వహిస్తుందనడానికి ఇంతకు మించిన సాక్ష్యం అవసరం లేదు. ఇంతవరకు రష్యా ఫెడరేషన్ అధికారులు, ఉక్రెయిన్ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు.
ఎందుకంటే అంతా చేయిస్తోంది పుతినే కాబట్టి అతను లేకుండా ఈ యుద్ధాన్ని ముగించడం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. అంతేకాదు రష్యా దళాల జరిపిన యుద్ధ నేరాలు గురించి చర్చలు జరిపేందుకు రష్యా విముఖత చూపించిందే తప్ప అవకాశం ఇవ్వలేదు. అందువల్ల రష్యా అధ్యక్షుడితో తప్ప ఇక ఏ రష్య అధికారితో సమవేశం అవ్వం" అని తేల్చి చెప్పారు.
అంతేకాదు దౌత్యం లేకుండా ఈ యుద్ధాన్ని ఆపడం అసాధ్యం అని జెలెన్ స్కీ చెప్పారు. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ చాలా మంది పౌరులను కోల్పోయి భారీ మానవ మూల్యాన్ని చెల్లించిందని కూడా చెప్పారు. మరోవైపు ఖార్కివ్ సమీపంలో ఉక్రెయిన్ దళాలు బలపడుతున్నాయి కానీ డాన్‌బాస్‌లో సైన్యం అత్యంత రక్తపాతాన్ని ఎదుర్కొవడమేకాక చాలామందిన్ని కోల్పోతోందని ఆవేదనగా చెప్పారు జెలెన్‌స్కీ.
(చదవండి: చనిపోయే స్థితిలో రష్యా ‘మాక్స్’.. ప్రాణాలు నిలిపిన ఉక్రెయిన్‌కు సాయం)
Comments
Please login to add a commentAdd a comment