778 అదనపు బస్సులు
మహాశివరాత్రి
జాతరకు
వేములవాడఅర్బన్: మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడ బస్టాండ్‌లోని మేనేజర్ కార్యాలయంలో 11 డిపోల మేనేజర్లు, ఆర్టీసీ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. వేములవాడలోని బస్టాండ్‌కు 443, కట్ట కింద బస్‌స్టేషన్‌కు 335 బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. వీటికితోడు ఉమ్మడి జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరానికి కూడా అదనపు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు సంస్థ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మేనేజర్లు, సిబ్బంది తమకు కేటాయించిన డిపోల్లో విధులు నిర్వహించాలని సూచించారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్లు భూపతిరెడ్డి, సత్యనారాయణ, డిపో మేనేజర్ శ్రీనివాస్ తదితరులున్నారు.
డిపోల వారీగా వేములవాడ గుడి చెరువు కట్టకింద బస్టాండ్‌కు వచ్చే బస్సులు..
నిర్మల్ 83, ఆర్మూర్ 100, నిజామాబాద్–1 నుంచి 17, కామారెడ్డి 33, నర్సంపేట 30, వరంగల్–1 నుంచి 21, హనుమకొండ 27, పరకాల 24 మొత్తం 335 బస్సులు నడవనున్నాయి.
వేములవాడ బస్టాండ్‌కు వచ్చే బస్సులు..
కరీంనగర్–1 డిపో నుంచి 67, కరీంనగర్–2 నుంచి 37, కోరుట్ల 62, మెట్‌పల్లి 105, వేములవాడ 105, సిరిసిల్ల 52, హుజూరాబాద్ 15 మొత్తం 443 బస్సులు నడి పించనున్నారు.
కాళేశ్వరానికి..
మంథని డిపో నుంచి మంథని–కాళేశ్వరం 26 బస్సులు. వీటికితోడు భక్తుల రద్దీకి అనుగుణంగా గోదావరిఖని, కరీంనగర్‌ల నుంచి కూడా బస్సులను నడపనున్నారు.
వేలాలకు..
గోదావరిఖని డిపో నుంచి గోదావరిఖని–వేలాలకు 56, మంథని డిపో నుంచి మంథని–వేలాలకు 40 బస్సులు నడుస్తాయి.
దుబ్బ రాజన్నకు ఆలయానికి..
జగిత్యాల డిపో నుంచి జగిత్యాల–దుబ్బరాజన్న ఆలయానికి 50 బస్సులను ఆర్టీసీ నడిపించనుంది.
పొట్లపల్లికి..
హుస్నాబాద్ డిపో నుంచి హుస్నాబాద్–పొట్లపల్లికి 23 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్‌తెలిపారు. శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారి సౌజన్యంతో 14 మినీ బస్సులు వేములవాడ(తిప్పాపూర్) నుంచి వేములవాడ గుడి వరకు, తిరుగు ప్రయాణంలో గుడి నుంచి వేములవాడ బస్‌స్టేషన్ వరకు ఉచిత ప్రయాణ సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
వేములవాడకు ఈ నెల 25 నుంచి 27 వరకు నడిపిస్తాం ఆర్టీసీ కరీంనగర్ ఆర్‌ఎం రాజు
778 అదనపు బస్సులు
Comments
Please login to add a commentAdd a comment