మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలంలోని మెట్లచిట్టాపూర్‌లోగల మహాత్మజ్యోతిబాపూలే బాలికల గురుకులంలో పలువురు విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకట్రావుపేటలో నిర్వహిస్తున్న గురుకులంలో ఈనెల 8న వేకువజామున విద్యార్థినులు నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో కొందరిని ఎలుకలు కరిచాయి. తీవ్ర నొప్పితో ఇబ్బంది పడిన విద్యార్థినులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు యాంటీరేబీస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఎలుకలు కరిచిన వారిలో 8వ తరగతికి చెందిన ముగ్గురు, తొమ్మిదో తరగతికి చెందిన ఒకరితోపాటు మరికొందరు ఉన్నట్లు సమాచారం. వీరందరికి ఇప్పటికే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మూడు డోస్‌లు పూర్తయినట్లు తెలుస్తోంది. గురుకులంలో ఎలుకల బెడద తీవ్రంగా ఉందని, పక్కనే ఉన్న ఓ బియ్యం గోదాం నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఇదే గురుకుల పాఠశాలలో గతంలో కూడా ఎలుకల బెడదతో విద్యార్థినులు గాయపడిన సందర్భాలున్నాయి. అయినా సిబ్బంది ఆ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మెట్లచిట్టాపూర్ జ్యోతిబాపూలే బాలికల గురుకులంలో ఘటన
ఆలస్యంగా వెలుగులోకి
Comments
Please login to add a commentAdd a comment