నేడు జగిత్యాలకు హైకోర్టు జడ్జి రాక
జగిత్యాలజోన్: హైకోర్టు న్యాయమూర్తి పుల్ల కార్తీక్ శనివారం జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో జరిగే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అలాగే కాసుగంటి కుటుంబసభ్యుల సహకారంతో నిర్వహిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారం కార్యక్రమంలో కూడా పాల్గొంటారు.
సమయపాలన పాటించాలి
రాయికల్(జగిత్యాల): ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు సేవలు అందించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్ సూచించారు. శుక్రవారం మండలంలోని ఒడ్డెలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫార్మసీ ల్యాబ్, వ్యాక్సిన్ స్టోరేజ్ రూమ్, రిజిష్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ సతీశ్, డీపీవో రవీందర్, యూనిట్ ఆఫీసర్ శ్రీధర్, సూపర్‌వైజర్ శ్రీనివాస్, ఫార్మాసిస్ట్ దీపిక, ల్యాబ్ టెక్నీషియన్ రాజమణి, హెల్త్ అసిస్టెంట్ భూమయ్య ఉన్నారు.
మేడిపల్లి సబ్‌స్టేషన్ నుంచి నిరంతర విద్యుత్
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగే తొలి సబ్‌స్టేషన్ మేడిపల్లి అని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సాలియానాయక్ అన్నారు. మేడిపల్లి నుంచి వల్లంపల్లి వరకు 3 కి.మీ దూరం ఏర్పాటు చేసిన 33 కేవీ లింక్ లైన్‌ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. కొత్తగా ప్రారంభించిన ఇంటర్ లింక్ లైన్‌తో జగిత్యాల, రాయికల్, కథలాపూర్, కోరుట్ల విద్యుత్ సబ్ స్టేషన్లు, మేడిపల్లి సబ్ స్టేషన్‌తో ఇంటర్ కనెక్ట్ అవుతాయని పేర్కొన్నారు. దీంతో మేడిపల్లి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగదని, ఒకవేళ ఎప్పుడైనా ఇబ్బందులు తలెత్తితే కొత్తగా ఇంటర్ కనెక్ట్ అయిన విద్యుత్ సబ్‌స్టేషన్ల నుంచి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెట్‌పల్లి డీఈ గంగారాం, కోరుట్ల రూరల్ ఏడీఈ రఘుపతి, మేడిపల్లి ఏఈ అర్జున్, సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
జగిత్యాల: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాలలో యూనియన్ బ్యాంక్ ఎదుట ఉద్యోగస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్యాంక్‌ల్లో తగిన నియామకాలు చేపట్టి ఐదు రోజుల బ్యాంకింగ్ పనులు అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మార్చి 3న పార్లమెంట్ ఎదుట ధర్నా చేపట్టి, అదే నెల 24, 25వ తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు సమ్మె చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు.
తెలుగుభాషను అందరూ గౌరవించాలి
జగిత్యాల: తెలుగుభాష ను అందరూ గౌరవించాలని, ఆంగ్ల భాష మో జులో పడి మాతృభాష ను మర్చిపోవద్దని పెన్షనర్స్ అసోసియేషన్ జి ల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం కార్యాలయంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెన్షనర్ యాకూబ్ కార్యాలయంలో ప్రతీ ఫైల్‌ను తె లుగులోనే రాస్తూ అందరికీ ఆదర్శంగా నిలి చారన్నారు. అనంతరం అతడిని ఘనంగా సన్మానించారు. నాయకులు విజయ్, విశ్వనాథం, హన్మంతరెడ్డి పాల్గొన్నారు.
నేడు జగిత్యాలకు హైకోర్టు జడ్జి రాక
నేడు జగిత్యాలకు హైకోర్టు జడ్జి రాక
నేడు జగిత్యాలకు హైకోర్టు జడ్జి రాక
నేడు జగిత్యాలకు హైకోర్టు జడ్జి రాక
Comments
Please login to add a commentAdd a comment