వాటర్‌ప్లాంట్ ప్రారంభం
రాయికల్(జగిత్యాల): మండలంలోని చెర్లకొండాపూర్ గ్రామంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, గ్రామస్తులు, దాతల సహకా రంతో శుక్రవారం వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. 2024 అక్టోబర్ 4న ‘సాక్షి’లో ‘చెర్లకొండాపూర్‌లో ఫ్లోరైడ్ భూతం’ శీర్షికన కథనం ప్రచురితం కాగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పందించి వాటర్‌ప్లాంట్ కోసం బోరు మంజూరు చేశారు. అలాగే ప్లాంట్ నిర్మాణం కోసం గ్రామస్తులు సు మారు రూ.2 లక్షలు దాతల సహకారంతో జమచేశారు. మానోస్ యూనిదాస్ సంస్థ ఎన్జీవో, ఫాతిమానగర్ ఆడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.1.85 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైర్ యంత్రాన్ని ప్రాజెక్ట్ డైరెక్టర్ సిస్టర్ ప్రీత, కోఆర్డినేటర్ దీప్తి, షారోన్ థెరిస్సా, కోఆర్డినేటర్లు మర్రి మల్లేశం, శ్రీని వాస్‌రెడ్డి, వేలం కనిసిస్టర్ ప్రారంభించా రు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ఫ్లోరైడ్ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’కి, నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలి పారు. మాజీ సర్పంచ్ ఆకుల రాజలక్ష్మి, నాయకులు దేవుని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
వాటర్‌ప్లాంట్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment