లక్ష్యంతో ముందుకెళ్లాలి
● అదనపు కలెక్టర్ లత
జగిత్యాల: బంగారు భవిష్యత్ కోసం విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ‘నా గమ్యం నా ప్రయా ణం’ ప్రేరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఈ మధ్యకాలంలో సామాజిక పరిస్థితుల ప్రభావాలతో ఆకర్శణకు లోనై భవి ష్యత్‌ను అంధకారంలోకి నెట్టుకుంటున్నారని పే ర్కొన్నారు. పట్టుదలతో చదివి అన్నిరంగాల్లో రా ణించాలని సూచించారు. జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్‌కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి సునీత, డీఈవో రాములు, బాలల పరిరక్షణాధికారి హరీశ్ పాల్గొన్నారు.
పల్లెప్రగతి పనులు వేగవంతం చేయండి
జగిత్యాలరూరల్: పల్లెప్రగతి పనులు వేగవంతం చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామాన్ని సందర్శించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అలాగే గ్రామంలోని బీసీ వెల్ఫేర్ మెన్స్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వేసవి దృష్ట్యా గ్రామస్తులకు తాగునీరు నిత్యం అందేలా చూడాలన్నారు. ఐదు రోజులుగా భగీరథ నీరు శుభ్రంగా ఉండడం లేదని గ్రామస్తులు తెలుపగా, నాణ్యమైన నీరు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. అలాగే నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాల్లోని వాటర్ ట్యాంక్‌లను ఎప్పటికప్పుడు శుద్ధి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో రవిబాబు, పంచాయతీ కార్యదర్శులు రాజేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment