అక్రమ నిర్మాణాలు తొలగించండి
గొల్లపల్లి(ధర్మపురి): మండల కేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. జనవరి 30న ‘సాక్షి’లో ‘దర్జాగా ప్రభుత్వ భూ ముల కబ్జా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అక్రమంగా ఇళ్ల నిర్మాణంతో సొమ్ము చేసుకుంటున్న నాయకులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవా లని అధికారులను విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదేశించారు. అనంతరం రెవెన్యూ, పంచాయతీ అధికారులు పరిశీలించి నోటీసులు జారీ చేయగా, తహసీల్దార్ వరందన్ ఉన్నతాధికారులకు తగు చర్యల నిమిత్తం నివేదిక అందజేశారు. ఈక్రమంలో శుక్రవారం కలెక్టర్ సదరు ప్రభుత్వ స్థలా లను సందర్శించారు. గుట్ట ప్రాంతాల్లోని 735, 544 సర్వే నంబర్లలో 125.23 ఎకరాలలో ప్రభు త్వ కార్యాలయాలతో పాటు గుట్ట వెనకాల నిర్మించిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దళారుల మాటలు నమ్మి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన
మండలంలోని అబ్బాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆయిల్‌పామ్ నర్సరీని సందర్శించారు. ఆయిల్‌పామ్ మొక్కల సరఫరా తదితర వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీవో రఘువరన్, తహసీల్దార్ వరందన్, ఎంపీడీవో రామిరెడ్డి, ఎంపీవో సురేశ్‌రెడ్డి, హర్టికల్చర్ అధికారులు తదితరులు ఉన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment