చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
కరీంనగర్‌రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని బిర్లా ఇంటర్నేషన్ స్కూల్ చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం బొమ్మకల్ బైపాస్‌లోని బిర్లా స్కూల్‌లో ఒలింపియా ప్రథమ క్రీడా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో పదిరోజుల నుంచి విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు కబడ్డీ, క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, స్కేటింగ్, త్రోబాల్, రన్నింగ్ తదితర క్రీడలు నిర్వహించారు. విద్యార్థుల మార్చ్‌ఫాస్ట్, స్కూల్ లోగో ప్రదర్శన ఆకట్టుకుంది. చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి క్రీడాజ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు. విద్యార్థులు తమకు నచ్చిన క్రీడలో ప్రావీణ్యత పెంచుకుని రాణించాలని కోరారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బబితా విశ్వనాథన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment