హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు
● కార్మిక సంఘాల జేఏసీ నాయకులు
కోల్‌సిటీ(రామగుండం): హక్కుల సాధన కోసం పారిశుధ్య కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) నాయకులు కోరారు. గోదావరిఖని మార్కండేయకాలనీ లో శనివారం నిర్వహించిన సమావేశంలో బీఆర్‌టీయూ గౌరవ అధ్య క్షుడు మురళీధర్‌రావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.ముత్యంరావు, మున్సిపల్ ఏరియా గౌరవ అధ్యక్షుడు వై.యాకయ్య తదితరులు మా ట్లాడారు. పారిశుధ్య కార్మికులపై అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చీపుర్లు, పారలు, గంపలు, చెప్పు లు, మాస్కులు, గ్లౌస్‌లు, బెల్లం, స బ్బులు, కొబ్బరినూనె ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారని ధ్వ జమెత్తారు. వీటిగురించి అడిగితే పనులకు రావద్దని బెదిరిస్తున్నారని అన్నారు. పండుగ, జాతీయ సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు జనగామ రాయమల్లు, వేల్పుల కుమారస్వామి, కిష న్ నాయక్, రాధాకృష్ణ, నాగమణి, సారయ్య, సునీత, రామలక్ష్మి, పోస మ్మ, బోయిని రవీందర్, మంథని లింగయ్య, రాజేందర్, వేల్పుల రాయమల్లు, రూప పాల్గొన్నారు.
మద్దిర్యాలలో బాల్య వివాహం అడ్డగింత
రామగుండం: అంతర్గాం మండలంలోని మద్దిర్యాల గ్రామంలో ఓ బాలికకు వివాహం చేస్తున్నట్లు తెలిసి, తహసీల్దార్ రవీందర్ పటేల్, చైల్డ్ హెల్ప్‌లైన్, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బాలికకు ఈ నెల 15న(శనివారం) పెళ్లి చేయాలని నిర్ణయించారని కొందరు ఈ నెల 10న చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు సమాచారం ఇచ్చారు. దీంతో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కనకరాజు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అంజలి, 1098 కో–ఆర్డినేటర్ ఉమాదేవి, చైల్డ్‌లైన్ సూపర్‌వైజర్ రమాదేవి తదితరులు తహసీల్దార్‌తో కలిసి మద్ధిర్యాలలోని బాలిక ఇంటికి చేరుకున్నారు. ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేస్తామని వారు హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు. అయితే, శనివారం ఆ బాలికకు పెళ్లి చేస్తున్నారని తహసీల్దార్ రవీందర్ పటేల్, ఎస్సై వెంకటస్వామిలకు సమాచారం వచ్చింది. వారు బాధితురాలి తల్లిదండ్రులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు, సఖీ సిబ్బంది సమక్షంలో కౌన్సెలింగ్ చేశారు. అనంతరం పెళ్లి రద్దు చేసుకునేందుకు వారు అంగీకరించారు. ఈ విషయమై తహసీల్దార్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేస్తే రూ.లక్ష జరిమానాతోపాటు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. మైనర్లను పెళ్లి చేసుకునే మగవారికి పోక్సో చట్టం కింద జైలుశిక్ష పడుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment