కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కుక్కల దాడిలో ముగ్గురు గా యపడ్డారు. స్థాని కుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన తొమ్మిదేళ్ల శాన్వితో పాటు ఇద్దరు మహిళలు రుక్కుంబాయి, అనురాధలపై శనివారం కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అధికారులు స్పందించి, వాటిని దూరంగా తరలించాలని కోరుతున్నారు.
‘ఎల్లంపల్లి’లో తగ్గుతున్న నీటి నిల్వలు
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటినిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు శనివారం వెల్లడించిన సమాచారం మేరకు.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.5 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేదు. గూడెం పంపుహౌస్‌కు 290 క్యూసెక్కులు, హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు 283 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు.
గంజాయి విక్రయించేందుకు యత్నం : యువకుడి అరెస్టు
ఇల్లంతకుంట(మానకొండూర్): గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఓ యువకుడిని అరెస్టు చేసినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లికి చెందిన పున్ని వేణు గంజాయికి అలవాటు పడ్డాడు. దాన్ని అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని భావించి, కొనుగోలు చేశాడు. శనివారం జంగారెడ్డిపల్లి సమీపంలో విక్రయించాలని చూస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 60 గ్రాముల గంజాయి, ఒక ఫోన్ స్వాధీనం చేసుకొని, అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టింగ్ తరహాలో గంజాయి తాగిన వారిని పట్టుకునేందుకు కిట్లు ఉపయోగిస్తున్నామని తెలిపారు. గంజాయి సేవించినవారు దొరికితే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
పాలకుర్తి(రామగుండం): జీడీనగర్ శ్మశానవాటిక సమీపంలో శివరాత్రి పోచమ్మ(55) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బసంత్‌నగర్ పోలీసుల వివరాల ప్రకారం.. పోచమ్మ స్థానిక బీసీ కాలనీలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుండేది. ఆమె భర్త గతంలోనే మరణించగా, కుమారుడు రామగుండంలో ఉంటున్నాడు. శనివారం జీడీనగర్ శ్మశానవాటికలో కాలిపోయిన స్థితిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్, బసంత్‌నగర్ ఎస్సై స్వామి సంఘటన స్థలానికి చేరుకొని, పరిశీలించారు. మృతదేహం పక్కనున్న ఆధార్‌కార్డు ఆధారంగా పోచమ్మగా గుర్తించారు. మృతురాలి కుమారుడు అంజి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గంజాయి తరలిస్తున్న ముగ్గురి పట్టివేత
జగిత్యాల క్రైం: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని శనివారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం శివారులో సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. జగి త్యాల రూరల్ మండలం అంతర్గాం, నర్సింగాపూ ర్, ఆదిలాబాద్‌కు చెందిన యువకులు కలిసి, గంజాయి తరలిస్తుండగా పట్టుకొని, రూరల్ పోలీసులకు అప్పగించినట్లు వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment