మోటార్లు చోరీ.. ముగ్గురి అరెస్టు
మెట్‌పల్లి: సులభంగా డబ్బు సంపాదించడం కోసం చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని, వారు తీసుకువచ్చే సొత్తును కొనుగోలు చేస్తూ సహకరిస్తున్న ఓ స్క్రాప్ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. సంబంధిత వివరాలను శనివారం మెట్‌పల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్ వెల్ల డించారు. మెట్‌పల్లి పట్టణంలోని దీన్‌దయాళ్ నగర్‌కు చెందిన కుంచెపు వెంకటేశ్, మల్లాపూర్ మండలంలోని రాఘవపేటకు చెందిన సూర్యవంశీ సాయికుమార్ ట్రాక్టర్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. వెంకటేశ్‌కు వచ్చే జీతం కుటుంబ అవసరాలకు, తన జల్సాలకు సరిపోకపోవడంతో పలుచోట్ల దొంగతనాలు చేశాడు. అలాగే, గ్యాంగ్‌రేప్ కేసులో అరెస్టయ్యి, జైలుకెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత సాయికుమార్‌కు అతనితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ కలిసి వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైరు చోరీ చేయడం మొదలుపెట్టారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం క్రాసింగ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా.. ఈ ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. అదుపులోకి తీసుకొని, విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. సంబంధిత సామగ్రిని స్థానిక స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ బారికి విక్రయిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు వెంటనే స్క్రాప్ దుకాణానికి వెళ్లి, బారిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్‌తోపాటు 30 వ్యవసాయ మోటార్లు, 30 కిలోల కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. ముగ్గురినీ అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ రాములు, సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సైలు కిరణ్‌కుమార్, అనిల్, రాజు ఉన్నారు.
30 వ్యవసాయ మోటార్లు, 30 కిలోల కాపర్‌వైరు స్వాధీనం
వివరాలు వెల్లడించిన జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment