కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికి పడుతుంది
● ప్రధాని కులం గురించి మాట్లాడేస్థాయి సీఎంకు లేదు
● బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్
కరీంనగర్‌టౌన్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ సామాజికవర్గం గురించి మాట్లాడే స్థాయిలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నా రు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వా సం కోల్పోయిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డికి ప్రధా ని మోదీ కులం గురించి మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన ఓ బోగస్ ప్రక్రియ అన్నా రు. రెండోసారి కులగణన ఎందుకని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తీరు మార్చుకోకుంటే కేసీఆర్, కేజ్రీ వాల్‌కు పట్టిన గతే పడుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుంటే, ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్స్ తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమురయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment