ఎమ్మెల్సీ పోలింగ్ విధులపై అవగాహన ఉండాలి
జగిత్యాల:ఎమ్మెల్సీ పోలింగ్ విధులపై పీవో, ఏపీవోలకు అవగాహన ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వారికి శనివారం కలెక్టరేట్‌లో శిక్షణ కల్పించారు. ఎన్నికల మార్గదర్శకాలు, నిబంధనలు తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందన్నారు. ఓపిక, సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, గడువు లోపు కేంద్రంలో లైన్ ఉంటే టోకెన్ నంబరు ఇచ్చి ఓటింగ్ వేయించాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులు సెంటర్లకు సకాలంలో చేరుకోవాలని, పోలింగ్ సామగ్రి, బ్యా లెట్ బాక్స్‌లు, చెక్‌లిస్ట్ సరిచూసుకోవాలన్నారు. సెల్‌ఫోన్లు తీసుకెళ్లవద్దన్నారు. ఓటర్లు, అభ్యర్థులు, ఏజెంట్లకు సమస్యలుంటే నివృత్తి చేయాలన్నారు. జిల్లాలో 51 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు, 20 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలున్నాయని, 18 కామన్ పోలింగ్ కేంద్రాలని పేర్కొన్నారు.
పేదలందరికీ ఇళ్లు
పేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకుంటే వందశాతం సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. అర్హులను గుర్తించి గ్రామసభల్లో ప్రదర్శిస్తామని, ఈనెల 26వరకు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో పడక గది, హాల్, కిచెన్ సౌకర్యాలతో నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం మేసీ్త్రలు, కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. దశలవారీగా లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయని, ఆధార్ లింక్ చేయబడిన లబ్ధిదారు ఖాతాల్లో డబ్బులు జమ చేయబడతాయని పేర్కొన్నారు. అధికారులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పక్కాగా ఇళ్ల నిర్మాణ ప్రక్రియ చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్లు గౌతంరెడ్డి, బీఎస్.లత, డీఆర్డీవో రఘువరణ్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment