ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి
మల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని డీఆర్డీవో రఘువరణ్ అన్నారు. మండలంలోని కొత్తదాంరాజుపల్లిలో మొదటి విడత మంజురైన ఇళ్లకు మంగళవారం భూమిపూజ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుడు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని, బేస్‌మెంట్ వరకు పూర్తయితే రూ.లక్ష లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. నిర్మాణం పూర్తయ్యే వరకు విడతల వారీగా రూ.5లక్షలు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. మధ్యవర్తులు డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టి కి తేవాలన్నారు. అంతకుముందు హుస్సేన్‌నగర్, ఒబులాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వన నర్సరీల్లో మొక్కలను పరిశీలించారు. మొక్కలు ఎండకుండా షేడ్ నెట్లు ఏర్పా టు చేయాలన్నారు. ఎండీపీవో శశికుమార్‌రెడ్డి, ఈజీఎస్ ఎపీవో సతీష్, టీఏ సరిత, కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment