బీఆర్‌ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం
రాయికల్: బీఆర్‌ఎస్ కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. మండలంలోని ఇటిక్యాలలో మంగళవారం నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకునేలా కార్యకర్తలంతా ఐకమత్యంగా కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, మండల కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్లు ఎలగందుల ఉదయశ్రీ, మారంపల్లి రాణి, కొల్లూరి వేణు, మహిళా విభాగం అధ్యక్షురాలు స్పందన, ఎస్సీ విభాగం అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్, నారాయణగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రొట్టె శ్రీనివాస్, చంద్రశేఖర్, మహేశ్, రఘునాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment