దుబ్బ రాజన్న జాతరను సక్సెస్ చేద్దాం
సారంగాపూర్: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దుబ్బరాజన్న స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం వివిధ శాఖల మండల, జిల్లాస్థాయి అధికారులు సమావేశమయ్యారు. తహసీల్దార్ జమీర్, ఎంపీడీవో గంగాధర్, సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై దత్తాద్రి, వైద్యాధికారి రాధిక, ఆలయ ఈవో అనూష, ఏఈలు ప్రవీణ్, రాజమల్లయ్య, ఆర్‌ఐ వెంకటేశ్, ఎంపీవో సలీం పాల్గొన్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు మహాశివరాత్రి సందర్భంగా 2.50లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చర్చించారు.
● జగిత్యాల పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, జ న్నారం వైపు నుంచి ఆర్టీసీ బస్సులు నడపాల ని, పాత బస్టాండ్ నుంచి ప్రతి పది నిమి షాలకో బస్సు నడిపించాలని నిర్ణయించారు.
● ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం నుంచి మిషన్‌భగీరథ నీరు సరఫరా కావడం లేదని, ఈ నేపథ్యంలో జగిత్యాల మున్సిపాలిటీ ట్యాంకర్లతోపాటు, గ్రామపంచాయతీ ట్యాంకర్లను వినియోగించుకోవాలని నిర్ణయించారు.
● ఇప్పటికే నిరంతర విద్యుత్ సరఫరాకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేసిన క్రమంలో రెండు పెద్ద జనరేటర్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు.
● పారిశుధ్య నిర్వాహణ, కోనేరులో మురికి నీరు తొలగింపు, క్లోరినేషన్‌కు వంద మంది వరకు గ్రామపంచాయతీల సిబ్బందిని వినియోగించనున్నారు.
● ఎస్సారెస్పీ నుంచి డి–53, 11ఆర్ కాలువకు ఈనెల 28 వరకు నిరంతరం సరఫరా చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు సూచించారు.
● దర్శనానికి వచ్చే వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని, వారికి పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించారు. సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆలయం ముందు ప్రత్యేక వైద్య శిబిరాలు, అగ్నిమాపక యంత్రం, రిస్క్ టీంలను అందుబాటులో ఉంచనున్నారు.
బ్రహ్మోత్సవాలపై ముగిసిన సమన్వయ సమావేశం
భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలకు హామీ
Comments
Please login to add a commentAdd a comment