బంజారాల ఆరాధ్యం సంత్‌ సేవాలాల్‌ | - | Sakshi
Sakshi News home page

బంజారాల ఆరాధ్యం సంత్‌ సేవాలాల్‌

Published Wed, Feb 19 2025 1:49 AM | Last Updated on Wed, Feb 19 2025 1:45 AM

బంజార

బంజారాల ఆరాధ్యం సంత్‌ సేవాలాల్‌

జగిత్యాలటౌన్‌: బంజారాల పరిరక్షణకు కృషి చేసిన మహనీయుడు సంత్‌సేవాలాల్‌ మహరాజ్‌ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బంజారా భవన్‌లో మంగళవారం నిర్వహించిన సేవాలాల్‌ 286వ జయంతిలో అదనపు కలెక్టర్‌ లతతో కలిసి పాల్గొన్నారు. బంజారాల్లో చైతన్యం నింపేందుకు సేవాలాల్‌ కృషి చేశారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ మత్తు, జీవహింస పాపమని బోధించిన సేవాలాల్‌ ఆదర్శప్రాయుడని కొనియాడారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్‌, డీఈవో రాము, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సాలియానాయక్‌, డీఈ జవహర్‌నాయక్‌, తహసీల్దార్‌ రాంమోహన్‌, ఎంపీవో వాసవి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, దశరథ్‌నాయక్‌, భూక్యా నరేందర్‌, అజ్మీరా సంతోష్‌నాయక్‌, బంజారా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

కుజదోష నివారణ పూజలు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి యాగశాలలో మంగళవారం కుజదోష నివారణ పూజలను ఘనంగా నిర్వహించారు. ఆల య అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ కలహాలు, వాస్తుదో షం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు భారీగా తరలివచ్చారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ దేవాలయాల్లో మొక్కులు చెల్లించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి

జగిత్యాలరూరల్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని జిల్లా మాతా శిశు సంక్షేమాధికారి జైపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల రూరల్‌ మండలం కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమీక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే గర్భిణులు సాధారణ ప్రసవం అయ్యేలా వైద్యులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ సౌజన్య, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

పీహెచ్‌సీ తనిఖీ

కథలాపూర్‌: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు. పీహెచ్‌సీలోని అన్ని విభాగాలను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. పీహెచ్‌సీలో రోజుకు ఎంతమందికి వైద్యం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివా స్‌, డీపీఎం రవీందర్‌, వైద్యాధికారులు సింధూజ, రజిత, సూపర్‌వైజర్‌ శ్రీధర్‌ ఉన్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిద్దాం

ధర్మపురి: పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని జైనా, దొంతాపూర్‌, ఆరెపెల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేపట్టారు. నరేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాయకులు ఎస్‌.దినేష్‌, చీపిరిశెట్టి రాజేశ్‌, మొగిలి తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బంజారాల ఆరాధ్యం   సంత్‌ సేవాలాల్‌1
1/4

బంజారాల ఆరాధ్యం సంత్‌ సేవాలాల్‌

బంజారాల ఆరాధ్యం   సంత్‌ సేవాలాల్‌2
2/4

బంజారాల ఆరాధ్యం సంత్‌ సేవాలాల్‌

బంజారాల ఆరాధ్యం   సంత్‌ సేవాలాల్‌3
3/4

బంజారాల ఆరాధ్యం సంత్‌ సేవాలాల్‌

బంజారాల ఆరాధ్యం   సంత్‌ సేవాలాల్‌4
4/4

బంజారాల ఆరాధ్యం సంత్‌ సేవాలాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement