అటవీ సంరక్షణపై అవగాహన
కథలాపూర్(వేములవాడ): అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా.. విలువైన వృక్ష సంపదకు నష్టం వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు ఫైర్‌లైన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వేసవిలో చెట్ల ఆకులు రాలడంతో చిన్నపాటి నిప్పురవ్వ పడినా అడవిలో మంటలు విస్తరిస్తాయి. ఇలాంటివి జరగకుండా అధికారులు ముందస్తుగా సమీప గ్రామాలు, రోడ్లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు.
జిల్లాలో ఐదు అటవీ రేంజ్‌లు
జిల్లాలో 53,734.789 హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. ఈ అడవుల పర్యవేక్షణకు అటవీశాఖలో మెట్‌పల్లి, రాయికల్, జగిత్యాల, ధర్మపురి, కొడిమ్యాల రేంజ్‌లుగా విభజించారు. వీటి పరిధిలో 26 సెక్షన్లు, 76 బీట్లుగా విభజించారు.
మానవ తప్పిదాలతోనే అగ్నిప్రమాదాలు
అగ్ని ప్రమాదాలు సహజసిద్ధంగా.. మరికొన్ని సమయాల్లో మానవ తప్పిదాలతో జరుగుతుంటాయి. పశువుల కాపర్లు అడవులకు వెళ్లిన సమయంలో బీడీలు, సిగరెట్లు తాగి నిర్లక్ష్యంగా పారేయడం, వ్యవసాయ భూముల్లో వ్యర్థాలను కాల్చడం వంటి కారణాలతో మంటలు అంటుకున్నాయి. ఇలా జరగకుండా ఉండేందుకు అటవీ అధికారులు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీడీలు, అగ్గిపెట్టెలను అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లొద్దని సూచిస్తున్నారు.
ఫైర్‌లైన్ నిర్మాణం ఇలా..
అగ్ని ప్రమాదాలు జరగకుండా అధికారులు ఎండకాలం ప్రారంభం నుంచి ఫైర్‌లైన్ నిర్మాణం (రాలిన ఆకులను ఒకచోట పేర్చి కాల్చడం) చేపడుతారు. ఫైర్‌లైన్ నిర్మాణంతో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫైర్‌లైన్ ఉన్నంతవరకు మాత్రమే మంటలు వచ్చి ఆగిపోతాయి. అయినప్పటికీ మంటలు వ్యాప్తి చెందితే సిబ్బంది ఫైర్ బ్లోయర్ల సాయంతో ఆర్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఫైర్‌లైన్లపై ప్రధానంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
ప్రజలను చైతన్యపరిచేలా కార్యక్రమాలు
అధికారుల ప్రత్యేక కార్యాచరణ
రోడ్డు సౌకర్యం కల్పించాలి
అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం మంచిదే. అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందితే సిబ్బంది, ప్రజలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకునేలా రోడ్డు సౌకర్యం కల్పించాలి. పెద్ద నష్టాలను అరికట్టవచ్చు. అడవుల్లో బోరుబావులు ఏర్పాటు చేసి మినీట్యాంకులు నిర్మించాలి. తద్వారా జంతువులకు దాహం తీర్చినట్లవుతుంది.
– బద్దం మహేందర్, యువకుడు,
కథలాపూర్
అగ్నిప్రమాదాలపై అవగాహన
వేసవికాలంలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్నిప్రమాదాలను నివారించి చెట్లను కాపాడటానికి ప్రజల సహకారం అవసరం. అందుకోసం అగ్నిప్రమాదాల నివారణతోపాటు ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యతగా భావించాలి. అగ్నిప్రమాదాలు జరిగితే ప్రజలు అటవీశాఖ అధికారులకు సకాలంలో సమాచారం ఇవ్వాలి.
– షౌకత్‌ఆలీ, ఎఫ్‌ఆర్‌వో, మెట్‌పల్లి
అటవీ సంరక్షణపై అవగాహన
అటవీ సంరక్షణపై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment