సంత్ సేవాలాల్ మార్గం అనుసరణీయం
పెగడపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవమైన మహారాజ్ సంత్‌సేవాలాల్ మార్గం అనుసరనీయమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని మద్దులపల్లిలో గ్రామంలో ఆదివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి సేవాలాల్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సేవాలాల్ ఆశయాలకు అనుగణంగా గిరిజనులు నడుచుకోవాలని సూచించారు. సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
మహాశివరాత్రికి
దుబ్బరాజన్నకు ప్రత్యేక బస్సులు
సారంగాపూర్: మహాశివరాత్రి సందర్భంగా దుబ్బరాజన్న జాతర బ్రహ్మోతవాల్లో మూడు రోజుల పాటు జగిత్యాల ఆర్టీసీ డిపో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆలయ ఈవో అనూష తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు జరగనుండగా, 25,26,27 తేదీల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంటుందని ఈ మూడు రోజుల్లో ఆర్టీసీ జగిత్యాల డిపో నుంచి ప్రతి 10 నిముషాలకో ప్రత్యేక బస్సు నడుపుతారని ఆలయ ఈవో అనూష తెలిపారు. కోనాపూర్ స్టేజి వద్ద బస్సులు ఆపుతారని తెలిపారు.
నేటి ప్రజావాణి రద్దు
జగిత్యాలటౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.
సంత్ సేవాలాల్ మార్గం అనుసరణీయం
Comments
Please login to add a commentAdd a comment