ధర్మపురిలో సంకటహర చతుర్థి
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం మహాగణపతి ఆలయంలో ఆదివారం సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్‌శర్మ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
బీర్‌పూర్ నృసింహుని సన్నిధిలో వేదసదస్సు
సారంగాపూర్: బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి సన్నిధిలో ఆదివారం రాత్రి వేదసదస్సు నిర్వహించారు. చిన్నజీయర్ ట్రస్టు నుంచి వచ్చిన వేదపండితులు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదర్వణ వేదాలను పటించారు. యాగశాలలో హోమం చేశారు. ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగించారు. ఆలయ ప్రధాన అర్చకులు వొద్ధిపర్తి పెద్దసంతోష్, చిన్నసంతోష్, మధుకుమార్, హేమంతాచార్యులు, ఆలయ మాజీ చైర్మన్ ఎనగంటి సామ్రాట్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు స్వామివారి రథోత్సవం
నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుండి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.
ధర్మపురిలో సంకటహర చతుర్థి
Comments
Please login to add a commentAdd a comment