రైస్‌మిల్లుల తనిఖీ
మల్లాపూర్ : మండలంలోని రాఘవపేట, చిట్టాపూర్ గ్రామాల్లోని రైస్‌మిల్లులను సోమవారం అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత తనిఖీ చేశారు. మిల్లులకు కేటాయించిన, ఇప్పటివరకు మిల్లింగ్ చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం ధాన్యం అందించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వీర్‌సింగ్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, సీవిల్ సప్లై డీటీ ఉమాపతి, టెక్నికల్ అసిస్టెంట్ వంశీ, ఆర్‌ఐ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘విప్’ను కలిసిన పీఏసీఎస్ సభ్యులు
ధర్మపురి: సహకార సంఘాల (పీఏసీఎస్)ల పాలకవర్గ పదవి కాలాన్ని ప్రభుత్వం ఆరు నెలల పొడిగించడంపై ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను సోమవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన సహకార సంఘాల పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో సహకార సంఘాల అధ్యక్షులు సౌళ్ల నరేష్, సాయిని సత్యనారాయణ, రత్నాకర్, వేణుగోపాల్, రాంరెడ్డి, భాస్కర్ తదితరులున్నారు.
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
జగిత్యాలక్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల కు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 10 మంది నుంచి దరఖా స్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
దరఖాస్తులు ఆహ్వానం
జగిత్యాల:జిల్లాలోని ఆదర్శపాఠశాలల్లో 2025–26 సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాము సూచించారు. 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఈనెల 28 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 3న హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఆరో తరగతి వారికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 10వ తరగతి వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు ఉంటుందని పేర్కొన్నారు.WWW.TELANGANA.MCGG .GOV.INలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్లాస్టిక్ వినియోగిస్తే చర్యలు
జగిత్యాల: ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శానిటరీ ఇన్‌స్పెక్టర్ మహేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్లను పరిశీలించారు. ప్లాస్టిక్ కవర్స్ వాడొద్దని, శుభ్రత పాటించాలని సూచించారు. టిఫిన్స్ సెంటర్ వద్ద పరిశుభ్రత పాటించకున్నా.. ప్లాస్టిక్ కవర్లు వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్లాస్టిక్ కవర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన వెంట సిబ్బంది చంద్రశేఖర్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
రైస్‌మిల్లుల తనిఖీ
రైస్‌మిల్లుల తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment