గ్రాడ్యుయేట్స్ 3,55,159, టీచర్స్ 27,088
● ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఓటర్లు ఖరారు ● ఓటర్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ ● నేతలందరి దృష్టి కన్నారంపైనే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు తుది ఓటర్ల జాబితా ఖరారైంది. సోమవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకా ల ప్రకారం.. పట్టభద్రుల ఓటర్లుగా ఇప్పటివరకు 3,55,159 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 27,088 మంది ఎన్‌రోల్ చేసుకున్నారు. ఈనెల 3న నామినేషన్ ప్రక్రియ మొదలైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 100 మంది అభ్యర్థులు 192 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు 38 సెట్ల నామినేష న్లు వేశారు. ఉపసహంరణల అనంతరం గ్రాడ్యుయే ట్ ఎమ్మెల్సీ బరిలో 56 మంది, టీచర్స్ బరిలో 15 మంది నిలిచారు. ఇప్పటికే ఇటు గ్రాడ్యుయేట్స్, టీ చర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 27న జరిగే ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్
ఓటర్ల జాబితాలో కొత్త, పాత జిల్లాలవారీగా చూసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముందంజలో ఉంది. మొత్తంగా 4 ఉమ్మడి జిల్లాలు, 15 కొత్త జిల్లాలలోని 3.55 లక్షల ఓటర్లలో పాత కరీంనగర్ జిల్లాలోనే 1,60,260 మంది గ్రాడ్యుయేట్లు ఎన్‌రోల్ అయి ఉన్నారు. ఇక టీచర్స్ నియోజకవర్గంలో మొత్తం 27,088 ఓటర్లకు 18,953మంది నమోదు చేసుకున్నారు. ఏ రకంగా చూసినా.. కొత్త, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్ల పరంగా అగ్రభాగాన ఉన్న నేపథ్యంలో నాయకులంతా ఈ జిల్లాపైనే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజవర్గాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అత్యల్ప ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు, 8న ప్రక్రియ పూర్తికానుంది.
Comments
Please login to add a commentAdd a comment