ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
జగిత్యాల/రాయికల్: మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మాతాశిశు కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, మాజీమంత్రి రాజేశంగౌడ్, పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, నాయకులు మహిపాల్‌రెడ్డి, సందీప్‌రావు, ఆనందరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక, మాజీ జెడ్పీటీసీ మహేశ్, మాజీ కౌన్సిలర్లు శివకేసరిబాబు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను లండన్, బహ్రెయిన్‌లో ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్‌సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లండన్‌లో ఎఫ్‌టీసీ మాజీ చైర్మన్, ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్‌సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ మాట్లాడుతూ కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్ని మతాల పెద్దలతో ప్రార్థనలు, పూజలు చేయించారు. ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, ఉపాధ్యక్షుడు హరిగౌడ్, రవి, సతీశ్‌రెడ్డి, సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment