ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలి
కోరుట్లరూరల్: ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కోరుట్ల మండలంలోని నాగులపేట శివారులోని పెద్దవాగు, పైడిమడుగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను సోమవారం సందర్శించారు. నాగులపేట వెళ్లే దారిలో ఇసుక డంపులను చూసి వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్‌లు సమన్వయంతో నిరంతరం ఇసుక రవాణాపై నిఘా ఉంచాలన్నారు. సామాన్యులకు అతి తక్కువ ధరకు ఇసుక అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద కట్టుదిట్టపైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నాగులపేట వాగునుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో వాగులోకి వెళ్లేదారుల్లో ట్రెంచ్‌లు తవ్వి ట్రాక్టర్లు వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో జివాకర్ రెడ్డి, కోరుట్ల తహసీల్దార్ కిషన్, కథలాపూర్ తహసీల్దార్ వినోద్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ బి.సత్యప్రసాద్
కోరుట్ల మండలంలో ఇసుక రీచ్‌ల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment