జగిత్యాల:రెండు రోజుల క్రితం ధర్మపురిలో జరిగిన ఓ ముఖ్య సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గౌతమ్‌రెడ్డి హాజరుకాకపోవడాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. గౌతంరెడ్డి జెడ్పీ సీఈవో. గతంలో ఇక్కడ పనిచేసిన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దివాకర్ బదిలీపై వెళ్లడంతో గౌతంరెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన అదనపు కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ మధ్య వివాదాలు చోటుచేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల ధర్మపురిలో నిర్వహించిన ఓ ముఖ్య సమావేశానికి రావాలని కలెక్టర్ గౌతంరెడ్డికి సూచించినా తనకు వాహనం లేదని, ఎలా రావాలని ప్రశ్నించినట్లు తెలిసింది. తనకు క్వార్టర్, వాహనం సమకూర్చాలని కోరినట్లు సమాచారం. ఆయన పోస్టు జెడ్పీ సీఈవో కావడంతో అదనపు కలెక్టర్ వసతులు ఇవ్వడానికి అధికారులు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాజాగా సమావేశానికి రాకపోవడంతో కలెక్టర్ రెండు రోజుల క్రితం మెమో జారీ చేసినట్లు తెలిసింది. దీంతో గౌతమ్‌రెడ్డి సెలవుపై వెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన బాధ్యతలను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీఎస్.లతకు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
రెవెన్యూ అడిషనల్ కలెక్టర్‌కు అదనపు బాధ్యతలు
Comments
Please login to add a commentAdd a comment