మీటర్లు గిరగిరా.. | - | Sakshi
Sakshi News home page

మీటర్లు గిరగిరా..

Published Thu, Feb 20 2025 8:53 AM | Last Updated on Thu, Feb 20 2025 8:50 AM

మీటర్లు గిరగిరా..

మీటర్లు గిరగిరా..

● జిల్లాలో పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం ● వేసవి సమీపించడంతో మరింత పెరిగే చాన్స్‌ ● అప్రమత్తంగానే ఉన్నామన్న విద్యుత్‌ అధికారులు ● జిల్లాలో మొత్తం కనెక్షన్లు 5,29,944 ● వ్యవసాయ కనెక్షన్లు, 1,35,052 ● గృహ వినియోగ కనెక్షన్లు 3,36,696 ● పారిశ్రామిక కనెక్షన్లు 58,196

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో విద్యుత్‌ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సమీపిస్తుండటంతో మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఓ వైపు గృహాలకు, మరోవైపు వ్యవసాయానికి విని యోగం ఒక్కసారిగా పెరుగుతుండటంతో అధికా రులు అప్రమత్తమయ్యారు. విద్యుత్‌శాఖ అధికారు ల బృందం ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌తో వేసవిలో ఎలాంటి అంతరాయమూ లేకుండా విద్యుత్‌ సరఫరాకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంకోవైపు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మధ్యాహ్నం ఎండ వేడిమి, ఉద యం, సాయంత్రం వేళ చలిగా ఉంటోంది. మొన్న టి వరకు చలి ప్రభావంతో ఫ్యాన్లు వేసేందుకే జంకిన జనం.. పగటి ఉష్ణోగ్రతలు పెరిగి, ఉక్కపోత మొదలుకావడంతో కూలర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు ఏసీలు కూడా ఉపయోగించే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా విద్యుత్‌ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. గతేడాది జనవరిలో 130.596 మిలియన్‌ యూనిట్లు వినియోగిస్తే.. ఈ ఏడాది జనవరిలో 130.75 మిలియన్‌ యూనిట్లు వినయోగించారు. గతేడాది ఫిబ్రవరిలో 139.04 మిలియన్‌ యూనిట్లు వినియోగం కాగా.. ఈ ఏడాది 17వ తేదీ వరకు 87.222 యూనిట్లు వాడకం జరిగింది. ఈ నెల ముగియడానికి మరో 11 రోజులు ఉండడం.. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యుత్‌ వినియోగం పెరిగే అవకాశం ఉన్నట్లు విద్యుత్‌ అధికారులు భావిస్తున్నారు.

అప్రమత్తంగా ఉన్న విద్యుత్‌ సిబ్బంది

జిల్లాలో మొత్తం కనెక్షన్లు 5,29,944 ఉన్నాయి. ఇందులో వ్యవసాయ కనెక్షన్లు, 1,35,052, గృహ వినియోగ కనెక్షన్లు 3,36,696, పారిశ్రామిక కనెక్షన్లు 58,196 వరకు ఉన్నాయి. వేసవిలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేసేందుకు అధి కారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా వినియోగమయ్యే విద్యుత్‌కు అదనంగా 10 శాతం ఎక్కువ కేటాయింపు చేసుకుంటున్నారు. ఓవర్‌లోడ్‌ ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు అదనంగా 147 ట్రాన్స్‌ఫా ర్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి రోజూ ట్రాన్స్‌ఫార్మర్ల మీద పెరుగుతున్న లోడ్‌ వివరాలను సేకరిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌గాని, సబ్‌స్టేషన్‌లోగాని ట్రిప్‌ అయితే ఎందుకై ందో ఆగమేఘాల మీద ఉన్నతాధికారులు పరిశీలిస్తూ.. ఆ మేరకు క్షేత్రస్థాయి విద్యుత్‌ సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. ప్రతిరోజూ వారి విద్యుత్‌ డిమాండ్‌ పరిస్థితిని పరి శీలించేందుకు జిల్లా విద్యుత్‌ శాఖ కార్యాలయంలో డీఈలు, ఏడీఈ, ఏడీ, ఏఈలు జిల్లా విద్యుత్‌ అధి కారి సాలియానాయక్‌తో సమావేశమవుతున్నారు.

పొదుపే పరిష్కారం

సహజ వనరులైన బొగ్గు, నీరు, సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందని, ఆ కరెంట్‌ను గృహాలు, వ్యవసాయ కనెక్షన్లకు వినియోగించేందుకు చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని, విద్యుత్‌ను పొదుపుగా వాడటమే ఏకై క పరిష్కారమని విద్యుత్‌ అధికారులు సూచిస్తున్నారు. ఇంట్లో అయినా వీధి దీపాలైన అవసరం లేనప్పుడు స్విచ్ఛాప్‌ చేయాలని కోరుతున్నారు. అవసరం లేని సమయంలో ఫ్లాన్లు, లైట్లు ఆపివేయాలని నచ్చజెప్పుతున్నారు.

రైతులకు అవగాహన సదస్సులు

జిల్లాలో దాదాపు మూడు లక్షల వరకు విద్యుత్‌ పంపుసెట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రత్యేకంగా రైతులకు విద్యుత్‌ వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. రైతులు విద్యుత్‌ పంపుసెట్లకు ఆటోమెటిక్‌ స్టార్టర్లు బిగించుకుని, అవసరమున్నా.. లేకున్నా విద్యుత్‌ను ఎక్కువగా వృథా చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. విద్యుత్‌ పొదుపు చేసేందుకు ఫ్యూజ్‌ బాక్స్‌లో కెపాసిటర్లు బిగించుకోవాలని చెపుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ మోటార్ల వద్ద ఉన్న ఆటోమెటిక్‌ స్టార్టర్లను తొలగించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement