విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
జగిత్యాల: విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. విశ్రాంత ఉద్యోగులతో బుధవారం సమావేశమయ్యారు. దశాబ్దకాలంగా కలిసి ఉన్నామని, ప్రజాజీవితంలో నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయని, రాజకీయంగా అవకాశం వచ్చినప్పుడల్లా అభివృద్ధికి కృషి చేశానని గుర్తు చేశారు. ఈ సారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 317 ప్రకారం నాలుగు జోన్లుగా విభజించడంతో ఉద్యోగులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందన్నారు.
కాంగ్రెస్‌కు అండగా నిలవండి
మెట్‌పల్లి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్ కోరారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వేలాది పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యాసంస్థలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి పట్టభద్రుల సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందన్నారు. ఎన్నికల్లో అతనికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు జువ్వాడి కృష్ణారావు, జెట్టి లింగం, తిప్పిరెడ్డి అంజిరెడ్డి తదితరులున్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
జగిత్యాల: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. కొడిమ్యాలలోని పీహెచ్‌సీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు సరైన వైద్యం అందించాలని, మందుల కొరత లేకుండా చూడాలని, ఒకవేళ కొరత ఉంటే వెంటనే దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట వైద్యులున్నారు.
పంచాయతీ సిబ్బందికి
వేతనాలు విడుదల చేయాలి
జగిత్యాలరూరల్: గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ సిబ్బందికి వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ కార్యదర్శి పులి మల్లేశం అన్నారు. బుధవారం మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బందికి వేతనాల కోసం ప్రభుత్వం రూ.139 కోట్లు విడుదల చేసిందని, కార్మికులకు వేతనాలు, చెక్కులు గ్రామపంచాయతీ వారు పంపినా ట్రెజరీల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వేతనాలు అందక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వేతనాలు విడుదల చేయాలని కోరారు.
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
Comments
Please login to add a commentAdd a comment