కుష్ఠురహిత సమాజానికి కృషి చేయాలి
మల్యాల: కుష్ఠు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించాలని, వ్యాధి రహిత సమాజం కోసం కృషి చేయాలి కుష్ఠువ్యాధి నియంత్రణ జాయింట్ డైరెక్టర్ జాన్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఆస్పత్రిలోని రికార్డులు పరిశీలించారు. ఆరోగ్య సిబ్బంది ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలతో సమావేశమై వ్యాఽధి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తిస్తే ఎండీటీ డ్రగ్ ద్వారా నియంత్రించవచ్చన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బృందం సభ్యులు డీపీఎంఓ వెంకటేశ్వరచారి, వెంకటరమణ, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రామయ్య, డీఎంహెచ్‌ఓ ప్రమోద్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ ఎన్.శ్రీనివాస్, మండల వైద్యురాలు మౌనిక, హెచ్‌ఈఓ రమేశ్, పీహెచ్‌ఎన్ నాగలక్ష్మీ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కాంగ్రెస్ అంటేనే కరువు
● కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం
● యూరియా కొరత దురదృష్టకరం
● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
జగిత్యాల: కాంగ్రెస్ అంటేనే కరువు అని, ఆ పార్టీలో కన్నీళ్లు తప్పవని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగమన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ యూరియా కొరత లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొరత ఏర్పడిందని, అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతుల దుస్థితి అత్యంత దుర్భరంగా మారిందన్నారు. ఎరువులు అందడ లేదని, నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఎరువులు, విత్తనాలు, నీరు, కరెంట్ కొరత ఎప్పుడూ రాలేదన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే గోస పడతామని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుభరోసా రాలేదని, పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, మహిపాల్‌రెడ్డి, సందీప్‌రావు, ఆనందరావు పాల్గొన్నారు.
ఈనెల 18న అత్యధిక విద్యుత్ వినియోగం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఈనెల 18న అత్యధికంగా విద్యుత్ వినియోగమైనట్లు ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సాలియానాయక్ తెలిపారు. 18న 5.167 మిలియన్ యూనిట్లు వినియోగమైందని, రానున్న మూడు నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యుత్ లోడ్‌ను తట్టుకునేందుకు అదనంగా 121 ట్రా న్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. 33/11 కేవీ సబ్ స్టేషన్లలో కొత్తగా 3 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
జగిత్యాల బల్దియా ప్రత్యేకాధికారిగా లత
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ ప్రత్యేకాధికారిగా అదనపు కలెక్టర్ లత బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన లత.. మున్సిపల్ ప్రత్యేకాధికారిగానూ విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా ఆమెను కమిషనర్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు.
తాగునీటి సమస్య రానీయొద్దు
కథలాపూర్: వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని డీపీవో మదన్‌మోహన్ అధికారులకు సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమావేశమయ్యారు. మార్చి వరకు వందశాతం ఇంటిపన్ను వసూలు చేయాలన్నారు. ఉపాధిహామీ పనులకు కూలీలు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శంకర్, ఈసీ లక్ష్మయ్య పాల్గొన్నారు.
కుష్ఠురహిత సమాజానికి కృషి చేయాలి
కుష్ఠురహిత సమాజానికి కృషి చేయాలి
Comments
Please login to add a commentAdd a comment