అక్రమంగా మొరం తరలిస్తే చర్యలు
కోరుట్ల: పట్టణ శివారులోని ఏసికోని గుట్టకు కొందరు చేపడుతున్న మొరం తవ్వకాలను కలెక్టర్ బి.సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. అక్రమంగా మొరం తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడ కనిపించిన జేసీబీని చూసి సీజ్ చేయాలన్నారు. అక్రమంగా మొరం, మట్టి తరలించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గుట్ట ప్రాంతంలో 1254 సర్వే నంబర్‌లోగల 15 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. అనంతరం కోరుట్ల మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఇంటిపన్ను రికార్డులను పరిశీలించారు. ఇంటి పన్నులు వందశాతం వసూలు చేయాలని కమిషనర్ బట్టు తిరుపతిని ఆదేశించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్ కిషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
పన్నులు వందశాతం వసూలు చేయాలి
మేడిపల్లి: గ్రామాల్లో వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులతో గురువారం సమీక్షించారు. మార్చి 8 వరకు వసూలు పూర్తి చేయాలని సూచించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడి
ఏసికోని గుట్ట అక్రమ తవ్వకాల పరిశీలన
జేసీబీ సీజ్ చేయాలని ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment