గంజాయి విక్రయాలపై నిఘా ఉంచాలి
జగిత్యాలక్రైం: జిల్లాలో గంజాయి విక్రయాలు, ఇసుక అక్రమంగా తరలిపోకుండా నిఘా పెట్టాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం తన కార్యాలయంలో నెలవారీ నేరాలపై సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారి కదలికలు ఎప్పటికప్పుడు గమనించాలని, స్పెషల్ డ్రైవ్, తనిఖీలు నిర్వహించాలన్నారు. శివరాత్రి, హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామాలు, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. నేరం జరిగినప్పుడు సంఘటన స్థలంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎఫ్‌ఎస్‌ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. అదనపు ఎస్పీ భీంరావు, డీఎస్పీలు రఘుచంధర్, రాములు, రంగారెడ్డి, డీసీఆర్బీ, ఎస్బీ, ఐటీ కోర్, సీసీఎస్ సీఐలు శ్రీనివాస్, ఆరిఫ్‌అలీఖాన్, రఫీక్‌ఖాన్, శ్రీనివాస్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్, వేణు, సీఐలు వేణుగోపాల్, రామ్ నరసింహారెడ్డి, రవి, నిరంజన్‌రెడ్డి, కృష్ణరెడ్డి, సురేశ్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
నేరం చేస్తే శిక్ష తప్పదు
కోర్టు కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయడం.. శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్‌ప్రాసిక్యూటర్లను అభినందించారు. పోక్సో, హత్య కేసులను ప్రధానమైనవిగా భావించి ముందుకు సాగాలన్నారు. రెండు నెలల్లో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 14 మందికి జైలుశిక్ష పడిందన్నారు. పీపీలు బి.రాజేశ్, ఎం.రజని, జి.ప్రణయ్, జె.మల్లికార్జున్, కాసారపు మల్లేశం, సీహెచ్.రామకృష్ణను అభినందించి ప్రశంసపత్రాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment